Amazon Layoffs | ఏఐ ఎఫెక్ట్.. మరో 16 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న అమెజాన్
లేఆఫ్స్‌కి ఎంపిక చేసిన ఉద్యోగులకు 90 రోజుల నోటీసు పీరియడ్ ఉంటుందని, ఆలోపు వాళ్లు అమెజాన్‌లోనే కొత్త రోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
Technology | Published On Jan 28, 2026, 6.23 pm IST
Amazon Layoffs | ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి వార్తల్లోకెక్కింది. మరో 16 వేల ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పని చేస్తున్న అమెజాన్ ఉద్యోగుల్లో 16 వేల మందికి వరకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. అన్ని రంగాల్లో ఏఐ విప్లవం జోరందుకుంటున్న నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ఏఐ వల్ల తమ బిజినెస్ మోడల్‌ను కంపెనీలు రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. దీని వల్ల చాలా మంది ఉద్యోగులను తీసేయాల్సి వస్తుంది. ఏఐతో పాటు కాస్ట్ కటింగ్ కూడా ఒక కారణంగా కంపెనీలు చెబుతున్నాయి.
తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో అమెజాన్ ఉద్యోగులను తీసేస్తున్నట్లు వెల్లడించింది. లేఆఫ్స్‌కి ఎంపిక చేసిన ఉద్యోగులకు 90 రోజుల నోటీసు పీరియడ్ ఉంటుందని, ఆలోపు వాళ్లు అమెజాన్‌లోనే కొత్త రోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ 90 రోజుల లోపు అదే కంపెనీలో కొత్త రోల్ దొరకకపోతే, లేదా వాళ్లకు అదే కంపెనీలో కంటిన్యూ చేయడం ఇష్టం లేకపోతే వాళ్లకు సెవరేజ్ పే, ఔట్ ప్లేస్‌మెంట్ సర్వీసులు, హెల్త్ ఇన్సురెన్స్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్లను కంపెనీ నుంచి తీసేస్తామని కంపెనీ ప్రకటనలో పేర్కొన్నది. గత సంవత్సరం అక్టోబర్‌లో అమెజాన్ 14 వేల మంది ఉద్యోగులను తీసేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 16 వేల మంది అంటే మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులకు కంపెనీ ఉద్వాసన పలకడం అనేది కార్పొరేట్ చరిత్రలో ఇదే తొలిసారి కాబోతోంది.
సంబంధిత వార్తలు

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026

Amazon | ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
జులై 1, 2026

Amazon | ప్రధాని మోదీని కలిసిన అమెజాన్ సీఈవో.. భారత్‌లో మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా



