Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..
Amazon Prime Day 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌లో 10వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిచనున్నట్లు ప్రకటించింది. జూలై 4 అర్థరాత్రి 12 నుంచి జూలై 6 రాత్రి 11:59 గంటల వరకు మొత్తం 72 గంటల పాటు ఈ ప్రత్యేక సేల్ కొనసాగనుంది.
Technology | Published On Jun 29, 2026, 3.23 pm IST
Amazon Prime Day 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌లో 10వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిచనున్నట్లు ప్రకటించింది. జూలై 4 అర్థరాత్రి 12 నుంచి జూలై 6 రాత్రి 11:59 గంటల వరకు మొత్తం 72 గంటల పాటు ఈ ప్రత్యేక సేల్ కొనసాగనుంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఆడియో ప్రొడక్ట్స్‌తోపాటు అనేక విభాగాల్లో కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రైమ్ డే సందర్భంగా శాంసంగ్, వన్‌ప్లస్, బోట్, మార్షల్, హేయర్, బోష్, సోనీ, డెల్, లెనోవో, ఎల్‌జీ, షావోమీ, టీసీఎల్, లూమియో వంటి ప్రముఖ బ్రాండ్లు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం పరిమిత కాలానికి వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.1,499కు బదులుగా రూ.999కే అందిస్తున్నారు. అలాగే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ధర రూ.399 నుంచి రూ.299కు, ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ధర రూ.799 నుంచి రూ.599కు తగ్గించారు.
బ్యాంకు ఆఫర్లు సైతం..
ఇప్పటికే ప్రైమ్ లైట్ లేదా ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ వినియోగదారులు ప్రైమ్ డే ప్రారంభానికి ముందు స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రైమ్ సభ్యులు ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై గరిష్ఠంగా 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అపరిమిత 5 శాతం క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది. అమెజాన్ పే లేటర్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విభాగాల ఉత్పత్తులపై మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ ఫోన్ 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. వన్‌ప్లస్ ఎన్6లో 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతోపాటు 45 వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
ఆడియో ఉత్పత్తులపై..
ఆడియో విభాగంలో బోట్ నిర్వాణ యుటోపియా ధరను రూ.4,499గా నిర్ణయించారు. ఇందులో హెడ్ ట్రాకింగ్, స్పేషియల్ ఆడియో, గరిష్ఠంగా 20 గంటల ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్షల్ బ్రోంలీ 450 పార్టీ స్పీకర్ 360 డిగ్రీల సౌండ్, బాస్ ఈక్యూ కంట్రోల్స్, 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, మైక్రోఫోన్, ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌పుట్‌లతో అందుబాటులోకి రానుంది. జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ ధర రూ.15,999 కాగా, రూ.1,500తో ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఇందులో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2.0, స్పేషియల్ సౌండ్, ఎల్‌డాక్ సపోర్ట్, 80 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి.
ల్యాప్‌టాప్‌లు, టీవీలు..
ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ విభాగంలో డెల్ ఎలియన్‌వేర్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్ ఏఎండీ రైజెన్ ఆర్5 220 ప్రాసెసర్, ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 6జీబీ గ్రాఫిక్స్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ, 15.3 ఇంచుల డిస్‌ప్లేతో విడుదల కానుంది. లెనోవో ఎల్‌ఓక్యూ గేమింగ్ మానిటర్ 23.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 200 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10, ఏఎండీ ఫ్రీసింక్, 99 శాతం ఎస్‌ఆర్‌జీబీ కలర్ కవరేజ్‌ను అందిస్తుంది. హెచ్‌పీ ఓమ్నీబుక్ 3 కోర్ అల్ట్రా 9లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285హెచ్ ప్రాసెసర్, 16జీబీ డీడీఆర్5 ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ, 16 ఇంచుల 2కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. స్మార్ట్ టీవీల విభాగంలో సోనీ బ్రావియా 55, 65, 75 ఇంచుల 4కే మోడళ్లను తీసుకురానుంది. శాంసంగ్ స్మార్ట్ టీవీలు రూ.37,990 ప్రారంభ ధరతో 43 నుంచి 75 ఇంచుల వరకు లభిస్తాయి. ఎల్‌జీ స్మార్ట్ టీవీలు రూ.35,990 ప్రారంభ ధరతో ఏఐ ఆధారిత ఆడియో ఫీచర్లతో అందుబాటులో ఉంటాయి. షావోమీ స్మార్ట్ టీవీలు రూ.32,999 నుంచి ప్రారంభమై గూగుల్ టీవీ సపోర్ట్‌తో వస్తాయి. టీసీఎల్ స్మార్ట్ టీవీలు రూ.50,990 నుంచి,లూమియో స్మార్ట్ టీవీలు రూ.29,999 నుంచి ప్రారంభ ధరల్లో విక్రయానికి రానున్నాయి.
ప్రొజెక్టర్లపై..
ప్రొజెక్టర్ విభాగంలో బెన్‌క్యూ టీహెచ్575ఐ ధరను రూ.51,425గా నిర్ణయించారు. ఇందులో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, 3,800 లూమెన్స్ బ్రైట్‌నెస్, గూగుల్ టీవీ సపోర్ట్, 16.7 మిల్లీ సెకండ్ ఇన్‌పుట్ ల్యాగ్, వెర్టికల్ కీస్టోన్ కరెక్షన్, 1.1ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. లైఫ్‌లాంగ్ రోర్ ప్రొజెక్టర్ ఫుల్ హెచ్‌డీ, 4కే కంటెంట్ ప్లేబ్యాక్, డ్యూయల్ మైక్రోఫోన్లు, 20 వాట్ల స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఓటీటీ యాప్‌లు, గరిష్ఠంగా 150 ఇంచుల స్క్రీన్ సైజ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ అన్ని ఉత్పత్తులు, ఆఫర్లు జూలై 4 నుంచి 6 వరకు జరిగే అమెజాన్ ఇండియా ప్రైమ్ డే 2026 సేల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
సంబంధిత వార్తలు

Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..
జూన్ 29, 2026

Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?
జూన్ 24, 2026

Amazon Smartchoice Days | టెక్ షాపింగ్‌లో ఏఐ జోరు.. అమెజాన్ స్మార్ట్ చాయిస్ డేస్ సేల్ ప్రారంభం
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
- ●Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..
- ●Harish Rao | నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఖండించిన హరీశ్‌రావు
- ●Chirumarthi Lingaiah | తొక్కుతా తొక్కుతా అంటున్నవ్.. నిన్నే తొక్కేందుకు ప్రజలు వెయిటింగ్

Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే

Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..



