త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Health AI | అమెజాన్‌లో అందుబాటులోకి వ‌చ్చిన హెల్త్ ఏఐ.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Amazon Health AI | ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వ్య‌క్తిగ‌త ఏఐ సేవ‌ల్లో భాగంగా హెల్త్ ఏఐ ను మ‌రింత విస్త‌రించిన‌ట్లు తెలిపింది. అమెజాన్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో హెల్త్ ఏఐ ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, దీనికి తాజాగా మ‌రిన్ని మెరుగులు దిద్ది యూజ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

S

Technology | Published On Mar 29, 2026, 1.21 pm IST

Amazon Health AI | అమెజాన్‌లో అందుబాటులోకి వ‌చ్చిన హెల్త్ ఏఐ.. ఎలా ఉప‌యోగించాలంటే..?
Advertisement

Amazon Health AI | ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వ్య‌క్తిగ‌త ఏఐ సేవ‌ల్లో భాగంగా హెల్త్ ఏఐ ను మ‌రింత విస్త‌రించిన‌ట్లు తెలిపింది. అమెజాన్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో హెల్త్ ఏఐ ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, దీనికి తాజాగా మ‌రిన్ని మెరుగులు దిద్ది యూజ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సేవ‌ల‌ను కేవ‌లం వ‌న్ మెడిక‌ల్ యాప్‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌గా, దీన్ని ప్ర‌స్తుతం అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులోకి తెచ్చారు. అలాగే అమెజాన్ మొబైల్ యాప్‌లోనూ హెల్త్ ఏఐ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ టూల్‌ను వన్ మెడిక‌ల్‌తో అనుసంధానం చేసి యూజ‌ర్ల‌కు ఆరోగ్య సేవ‌ల‌ను అందిస్తున్నారు. అమెజాన్‌కు వ‌న్ మెడిక‌ల్ సంస్థ హెల్త్ స‌ర్వీసెస్ ప్రొవైడ‌ర్‌గా ఉంది. యూజ‌ర్ల‌కు ఆరోగ్య సేవ‌ల‌ను అందించ‌డాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకే ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామ‌ని అమెజాన్ తెలిపింది.

అవ‌స‌రం అయితే డాక్ట‌ర్‌తో అనుసంధానం..

అమెజాన్ అందిస్తున్న హెల్త్ ఏఐ వ్యక్తిగ‌త డేటాను ఉప‌యోగించ‌దు. కానీ ఆరోగ్యానికి సంబంధించిన ప్ర‌శ్న‌లను అడిగితే స‌మాధానాల‌ను ఇస్తుంది. అయితే వ్య‌క్తిగ‌త డేటాతోనూ స‌మాధానాలు పొందే వీలు క‌ల్పించారు. అందుకు గాను యూజ‌ర్లు త‌మ వైద్య చ‌రిత్ర‌తోపాటు ల్యాబ్ ఫ‌లితాలు, ఇత‌ర నిర్దార‌ణ‌లు, మందులు, ల‌క్ష‌ణాలు వంటి అంశాల‌ను క్షుణ్ణంగా వివ‌రించాల్సి ఉంటుంది. అవ‌స‌రం అయితే యూజ‌ర్ల‌ను డాక్ట‌ర్ల‌కు క‌నెక్ట్ కూడా చేస్తుంది. అలాగే అమెజాన్ ఫార్మ‌సీ ద్వారా యూజ‌ర్ల‌కు కావ‌ల్సిన మందుల‌ను పొంద‌వ‌చ్చు. అపాయింట్‌మెంట్‌ల‌ను బుక్ చేయ‌డం, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంబంధిత ఉత్ప‌త్తుల వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డం వంటి ప‌నులు కూడా చేస్తుంది.

ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు మాత్ర‌మే..

అమెజాన్ హెల్త్ ఏఐ యూజ‌ర్ల వైద్య రికార్డులు, మందులు, ల్యాబ్ ఫ‌లితాలు, అలాగే అమెజాన్‌లో గతంలో చేసిన ఆరోగ్య సంబంధిత ఉత్ప‌త్తుల కొనుగోళ్ల ఆధారంగా వ్య‌క్తిగ‌త సూచ‌న‌ల‌ను ఇస్తుంది. అవ‌స‌రం అయితే మెసేజింగ్ లేదా వీడియో కాల్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా వ‌న్ మెడిక‌ల్ ప్రొవైడ‌ర్ల నుంచి స‌హాయం అందిస్తుంది. అమెజాన్‌లో హెల్త్ పేజీని సంద‌ర్శించి యూజర్లు ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించేందుకు ఆస‌క్తిని న‌మోదు చేయ‌వ‌చ్చు. సేవ‌లు అందుబాటులోకి రాగానే యూజ‌ర్ల‌కు ఈ-మెయిల్ ద్వారా నిర్దార‌ణ పంపుతారు. దీంతో సేవ‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు వీలుంటుంది. ప్ర‌స్తుతానికి అమెజాన్ ఈ సేవ‌ల‌ను కేవ‌లం ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు మాత్ర‌మే, ఇన్వైట్ ఓన్లీ విధానంలో అందిస్తోంది. క‌నుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

ఎలా ఉప‌యోగించాలి..

ఇక ఈ సేవ‌ల‌కు ఆహ్వానం ల‌భిస్తే యూజ‌ర్ త‌న మొబైల్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇందుకు గాను రెండు ద‌శ‌ల్లో ధ్రువీక‌ర‌ణ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ హెల్త్ ప్రొఫైల్‌లోకి లాగిన్ అవ‌డం లేదా కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేయ‌డం ద్వారా ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అమెజాన్ వెబ్ సైట్‌లో లేదా యాప్‌లో హెల్త్ ఏఐ అని రాసి ఉన్న చాట్ బాక్స్‌లో యూజ‌ర్లు త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను పొంద‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌త స‌మాధానాల కోసం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎక్స్ఛేంజ్ అనే సిస్ట‌మ్‌కు యూజ‌ర్ త‌న వైద్య రికార్డుల‌ను యాక్సెస్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల యూజ‌ర్ త‌న వైద్య చరిత్ర‌, మందులు, ల్యాబ్ ఫ‌లితాలు, ఇత‌ర వివ‌రాల‌ను ఏఐ కి షేర్ చేసి అందుకు అనుగుణంగా ప్ర‌శ్న‌లు వేసి స‌మాధానాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు. అయితే అమెజాన్‌లో ఉన్న హెల్త్ ఏఐ కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మేన‌ని, చికిత్స‌కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని, వైద్య స‌ల‌హా లేదా డైట్ సూచ‌న కావాలంటే నిపుణుల‌ను సంప్ర‌దించాల‌ని ఆ సంస్థ సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement