Amazon Great Republic Day Sale 2026 | అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్.. ప్రీమియం ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
Amazon Great Republic Day Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2026ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లపై అద్భుతమైన రాయితీలను ఇస్తున్నారు.
Technology | Published On Jan 18, 2026, 8.17 am IST
Amazon Great Republic Day Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2026ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లపై అద్భుతమైన రాయితీలను ఇస్తున్నారు. ఈ సేల్ జనవరి 22వ తేదీ వరకు కొనసాగనుండగా, ఇందులో కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే కాకుండా, నాన్ ప్రైమ్ మెంబర్లకు కూడా ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అదనంగా 12.5 శాతం వరకు తగ్గింపు ధరను ప్రైమ్ మెంబర్లు పొందవచ్చు. అదే నాన్ ప్రైమ్ మెంబర్లకు అయితే 10 శాతం తగ్గింపు ధర లభిస్తుంది.
ఏకంగా రూ.10వేల డిస్కౌంట్..
ఈ సేల్‌లో భాగంగా మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్లను చాలా తగ్గింపు ధరలకు పొందవచ్చు. ముఖ్యంగా గతంలో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ ఫోన్ల ధరలు ఇప్పటికే మీడియం రేంజ్‌కు వచ్చాయి కనుక ఈ సేల్‌లో ఈ విభాగానికి చెందిన ఫోన్లను మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. గూగుల్‌కు చెందిన పిక్సల్ 9ఎ ఫోన్ ఇలాగే భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఏకంగా రూ.10వేల రాయితీని అందిస్తున్నారు. అలాగే ఈ మధ్యే లాంచ్ అయిన వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌ను కూడా ఈ సేల్‌లో తగ్గింపు ధరకు పొందవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.44,999 ధరకు లభిస్తుంది. దీని లాంచింగ్ ధర రూ.54,999 ఉండగా, ఇప్పుడు రూ.10వేల తగ్గింపుకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌పై సులభమైన ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. కనుక ఫోన్‌కు మొత్తం ధరను ఒకేసారి చెల్లించాల్సిన పనిలేదు.
బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫోన్లు..
అమెజాన్‌లో ఈ సేల్‌లో అందిస్తున్న ఆఫర్ల కారణంగా వినియోగదారులకు చాలా తక్కువ ధరలకు, తమ బడ్జెట్‌లో చక్కని ఫోన్లు లభిస్తున్నాయి. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉండడంతో ఫోన్ల ధరలు ఇంకా తగ్గాయి. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఆఫర్లను పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే బోనస్‌ను కూడా ఇస్తున్నారు. కనుక ఫోన్ ధర చాలా వరకు తగ్గుతుంది. ఇక ఈ సేల్‌లో వన్‌ప్లస్, శాంసంగ్, ఐక్యూ, రియల్‌మి, గూగుల్ వంటి బ్రాండ్లకు చెందిన ఫోన్లను చాలా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఏయే ఫోన్ల ధరలు ఎంత తగ్గాయి..?
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో భాగంగా రూ.54,999 ధర ఉన్న వన్‌ప్లస్ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌ను రూ.44,999కే అందిస్తున్నారు. అలాగే రూ.38,999 ధర కలిగిన ఐక్యూ నియో 10 ఫోన్‌ను రూ.33,999కు పొందవచ్చు. నథింగ్ ఫోన్ 3ఎ ప్రొ ఫోన్ లాంచ్ ధర రూ.36,999 ఉండగా, దీన్ని రూ.33,999కు అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 9ఎ ఫోన్ ధర రూ.49,999 ఉండగా, దీన్ని రూ.39,999 కు కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూషన్ లాంచింగ్ ధర రూ.27,999 ఉండగా, ఇప్పుడిది రూ.23,459కు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర రూ.79,999 ఉండగా, రూ.47,497కు అందిస్తున్నారు. రూ.44,999 ధర కలిగిన వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌ను ఇప్పుడు రూ.37,999కు విక్రయిస్తున్నారు. రూ.69,999 ధర కలిగిన రియల్‌మి జీటీ 7 ప్రొ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.49,999కు కొనవచ్చు. రియల్‌మి జీటీ 7 ఫోన్ లాంచింగ్ ధర రూ.48,999 ఉండగా, రూ.37,999కు అందిస్తున్నారు. అలాగే వివో వి60 5జి ఫోన్ లాంచింగ్ ధర రూ.39,999 ఉండగా, దీన్ని ప్రస్తుతం రూ.36,999 ధరకు ఈ సేల్‌లో అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



