Amazfit BIP Max | అమేజ్‌ఫిట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
Amazfit BIP Max | అమేజ్‌ఫిట్ తన బిప్ సిరీస్‌లో తాజా స్మార్ట్‌వాచ్ బిప్ మ్యాక్స్ ను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది విడుదలైన బిప్ 6 తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్‌లో పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్రైట్‌నెస్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను అందించింది. అమేజ్‌ఫిట్ బిప్ మ్యాక్స్‌లో 2.07 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు.
Technology | Published On Jun 10, 2026, 4.14 pm IST
Amazfit BIP Max | అమేజ్‌ఫిట్ తన బిప్ సిరీస్‌లో తాజా స్మార్ట్‌వాచ్ బిప్ మ్యాక్స్ ను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది విడుదలైన బిప్ 6 తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్‌లో పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్రైట్‌నెస్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను అందించింది. అమేజ్‌ఫిట్ బిప్ మ్యాక్స్‌లో 2.07 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 432 * 514 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. గరిష్టంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. బిప్ 6లో ఇది 2,000 నిట్స్ మాత్రమే ఉండగా, కొత్త మోడల్‌లో మరింత ప్రకాశవంతమైన డిస్‌ప్లేను తీసుకొచ్చారు. అలాగే ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్ కోసం యాంబియెంట్ లైట్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో దృఢమైన అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ సహాయంతో బ్లూటూత్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అలాగే 5 ఏటీఎం (50 మీటర్లు) వాటర్ రెసిస్టెన్స్‌ను అందించడంతో ఈత వంటి కార్యకలాపాల్లో కూడా ఉపయోగించవచ్చు.
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్..
బిప్ మ్యాక్స్‌లో బిల్ట్-ఇన్ జీపీఎస్ సపోర్ట్ ఉంది. జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యుజెడ్‌ఎస్‌ఎస్ సహా ఐదు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లకు మద్దతు ఇస్తుంది. 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ ట్రైనింగ్, హైరాక్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి అనేక ఫిట్‌నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తుంది. ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం జెప్ కోచ్ ఆధారిత పర్సనలైజ్డ్ ఏఐ కోచింగ్ ఫీచర్‌ను అందించారు. అలాగే 25 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మూవ్‌మెంట్లు, 8 స్పోర్ట్స్ మూవ్‌మెంట్‌లను ఆటోమేటిక్‌గా గుర్తించే స్మార్ట్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఉంది. ట్రాక్ రన్ మోడ్, స్మార్ట్ ట్రాజెక్టరీ కరెక్షన్, వర్చువల్ పేసర్, రేస్ అచీవ్‌మెంట్ ప్రిడిక్షన్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హార్ట్ రేట్, ఎస్‌పీఓ2, స్ట్రెస్ లెవెల్స్‌ను 24 గంటల పాటు మానిటర్ చేసే సామర్థ్యం ఉంది. బయోట్రాకర్ 6.0 పీపీజీ బయోమెట్రిక్ సెన్సర్, యాక్సిలరేషన్, జైరోస్కోప్, జియోమాగ్నెటిక్, యాంబియెంట్ లైట్ సెన్సార్‌లను కలిగి ఉంది.
ధర ఎంతంటే..?
ఈ స్మార్ట్‌వాచ్‌లో 4జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆఫ్‌లైన్ మ్యూజిక్, మ్యాప్స్‌ను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, కాల్ నోటిఫికేషన్లు, క్యాలెండర్ రిమైండర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్ నోటిఫికేషన్లు వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 550ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే బిప్ మ్యాక్స్ సాధారణ వినియోగంలో గరిష్టంగా 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. హెవీ యూజ్‌లో 10 రోజుల వరకు, నిరంతర జీపీఎస్ వినియోగంలో 40 గంటల వరకు పనిచేస్తుంది. అమేజ్‌ఫిట్ బిప్ మ్యాక్స్ సిల్వర్ కలర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.10,999గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్ ఇండియా, అమేజ్‌ఫిట్ వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత వార్తలు

Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 7, 2026

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఆగస్టు 4, 2026

Xiaomi 17T | షియోమీ 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకునే ఫ్లాగ్షిప్..
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!



