ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఓటీపీ లేకుండానే బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు జాగ్రత్త..
Technology | Published On Dec 5, 2025, 4.18 pm IST
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కచ్చితంగా ఓటీపీ ఉంటేనే బిల్లు చెల్లింపులు లేదా నగదు ట్రాన్స్‌ఫర్ పూర్తవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు ఇలా ఏ మాధ్యమం ద్వారా బిల్లు చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా కచ్చితంగా వినియోగదారులు ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ క్రమంలోనే చాలా మంది సైబర్ నేరస్థులు వినియోగదారుల నుంచి ఆ ఓటీపీలను ఎలాగైనా సరే సేకరించి వారి నగదును పెద్ద ఎత్తున దోచేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. అందుకనే ఓటీపీలు, కార్డుల సమాచారం, బ్యాంకు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తుంటారు. అయితే నేరస్థులు ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నారు. ఓటీపీ అవసరం లేకుండానే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును దోచేసే కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ప్రజలు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ఓ సరికొత్త మాల్‌వేర్ వ్యాప్తి చెందుతోంది. Albiriox virus అనే పేరిట ఓ మాల్‌వేర్‌ను సైబర్ నేరస్థులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మాల్‌వేర్ సహాయంతో ఓటీపీలు అవసరం లేకుండానే వినియోగదారులకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఈ మాల్ వేర్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోందని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు వ్యాప్తి చెందుతుందని వారు తెలిపారు. యూజర్లు ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర థర్డ్ పార్టీ సైట్ల నుంచి లేదా వేరే ఎక్కడి నుంచైనా ఏవైనా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వాటి ద్వారా ఈ మాల్‌వేర్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కనుక స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ కాకుండా ఇతర ఎక్కడి నుంచైనా సరే యాప్స్‌ను డౌన్ లోడ్ చేసి తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయకూడదని వారు సూచిస్తున్నారు. అలాగే ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్ విభాగంలోని Install unknown apps అనే ఆప్షన్‌ను సైతం డిసేబుల్ చేయాలని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది సైబర్ నేరస్థులు వినియోగదారుల నుంచి ఎలాగైనా సరే ఓటీపీలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును దోచేస్తుండగా, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న మాల్ వేర్ కారణంగా వారి పని మరింత సులభతరం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మాల్ వేర్ వ్యాప్తి చెందిన ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్ అన్నీ సైబర్ నేరస్థుల ఆధీనంలోకి వెళ్లిపోతాయని, అలాగే ఈ మాల్‌వేర్ కారణంగా ఓటీపీ అవసరం లేకుండానే వారు ఆ యాప్స్ ద్వారా వినియోగదారుల డబ్బును తమ ఖాతాల్లోకి సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని చెబుతున్నారు. కనుక ఒకసారి మీ ఫోన్‌కు గనక ఇలాంటి మాల్‌వేర్ వ్యాప్తి చెందితే అప్పుడు మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు మొత్తం మాయవుతుంది. కనుక యాప్స్‌ను ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



