Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..
Gold And Silver Prices Today | అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతోపాటు అమెరికా డాలర్ బలపడడం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఈక్విటీ మార్కెట్ల వైపు పెట్టుబడులు మళ్లుతుండడం వంటి కారణాలతో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు అంతర్జాతీయంగా, దేశంగా భారీగా పతనం అయ్యాయి.
Gold And Silver Prices Today | అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతోపాటు అమెరికా డాలర్ బలపడడం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఈక్విటీ మార్కెట్ల వైపు పెట్టుబడులు మళ్లుతుండడం వంటి కారణాలతో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు అంతర్జాతీయంగా, దేశంగా భారీగా పతనం అయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తరువాత అత్యంత గరిష్ట వారపు పతనంగా గత వారం నమోదైంది. ఇక గత సెషన్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2.43 శాతం పతనమై 3,537 డాలర్లకు చేరగా, వెండి ధర 3.76 శాతం క్షీణించి 41 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,674 పాయింట్లు పతనమై 1,21,778 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 9,669 పాయింట్లు తగ్గి 1,47,813 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు శనివారం ఒక మోస్తరుగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,508 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,00,064 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,25,080 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.12,50,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,465 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,46,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,381 ఉండగా, 8 గ్రాముల ధర రూ.75,048గా ఉంది. 10 గ్రాముల ధర రూ.93,810 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,38,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,00 ఉండగా, తులం ధర రూ.1,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,000 ఉండగా, తులం ధర రూ.1,750 గా ఉంది.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






