Airtel | ఎయిర్‌టెల్ నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..
Airtel | దేశంలో సుమారు 40 కోట్ల మంది వినియోగదారులతో ప్రముఖ టెలికాం సంస్థగా కొనసాగుతున్న ఎయిర్‌టెల్, బింజ్ వాచ్ చేసే వారికి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు, సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కలిపి విలువైన ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Jan 25, 2026, 12.39 pm IST
Airtel | దేశంలో సుమారు 40 కోట్ల మంది వినియోగదారులతో ప్రముఖ టెలికాం సంస్థగా కొనసాగుతున్న ఎయిర్‌టెల్, బింజ్ వాచ్ చేసే వారికి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు, సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కలిపి విలువైన ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ చూసే వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఎయిర్‌టెల్ ప్రస్తుతం తక్కువ ధర నుంచి ప్రీమియం స్థాయి వరకు విస్తృత శ్రేణిలో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో చాలావరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉంటాయి. దీని వల్ల వినియోగదారులు అదనంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించవచ్చు.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కావాలంటే..
నెట్‌ఫ్లిక్స్ అభిమానుల కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా కొన్ని ప్లాన్లను అందిస్తోంది. రూ.598 రీచార్జ్ ప్లాన్‌లో మొత్తం 50జీబీ డేటా, 30 రోజుల వాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే రూ.1729 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. మరోవైపు రూ.1798 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 84 రోజుల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్లన్నింటిలోనూ ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కల్పిస్తున్నారు. ఎక్కువగా స్ట్రీమింగ్ చేసే వారికి ఇవి ఖర్చు పరంగా కూడా లాభదాయకంగా మారనున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం కూడా ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. రూ.838 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 56 రోజుల వాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అలాగే రూ.1199 ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా, 84 రోజుల వాలిడిటీతో పాటు కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా ప్రైమ్ వీడియోతో పాటు ప్రైమ్ షాపింగ్ ఆఫర్లు, ఫాస్ట్ డెలివరీ వంటి అదనపు ప్రయోజనాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
జియో హాట్‌స్టార్ కోసం..
అలాగే క్రీడాభిమానులు, టీవీ షోలు ఇష్టపడే వారికి జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా కలిపిన ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. రూ.398, రూ.399, రూ.449, రూ.598, రూ.1029, రూ.1729 వంటి రీచార్జ్ ప్లాన్లలో డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. సాధారణంగా మ్యాచ్‌లు మాత్రమే చూసే వారికైనా, రోజూ గంటల తరబడి కంటెంట్ చూసే వారికైనా ఇవి అనువైన ప్లాన్లుగా ఉన్నాయి.
ప్రతి నెల ఓటీటీ యాప్‌ల కోసం విడిగా డబ్బులు చెల్లించడం భారంగా మారుతున్న ఈ రోజుల్లో ఈ ఎయిర్‌టెల్ ప్లాన్లు వినియోగదారులకు ఎంతో డబ్బును ఆదా చేయనున్నాయి. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఉచిత ఓటీటీ యాక్సెస్ లభించడం వల్ల ఒకే రీచార్జ్‌లో బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడింది. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేమికుల్లో ఈ ప్లాన్లకు మంచి ఆదరణ పెరుగుతోందని ఆ టెలికాం సంస్థ తెలియజేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్.. ఆ యూజర్లకే మొదటి ప్రాధాన్యత..
మే 19, 2026

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



