త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ల‌లో అదిరిపోయే బెనిఫిట్స్‌.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రూ.999 లేదా అంత‌న్నా ఎక్కువ విలువ క‌లిగిన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల‌కు గాను మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా కొత్త‌గా మూడు యాపిల్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

S

Technology | Published On Sep 22, 2026, 5.54 pm IST

Airtel | ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ల‌లో అదిరిపోయే బెనిఫిట్స్‌.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
Advertisement

Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రూ.999 లేదా అంత‌న్నా ఎక్కువ విలువ క‌లిగిన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల‌కు గాను మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా కొత్త‌గా మూడు యాపిల్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఐక్లౌడ్ ప్ల‌స్‌, యాపిల్ టీవీ, యాపిల్ ఆర్కేడ్ సేవ‌ల‌ను అర్హ‌త క‌లిగిన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపింది. వినియోగ‌దారులు త‌మ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో భాగంగా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ఒకే ఎయిర్‌టెల్ ప్లాన్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్‌, ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌, గేమింగ్ సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు యాప్ లేదా వెబ్‌సైట్‌, స్టోర్‌ల ద్వారా పొంద‌వ‌చ్చు.

యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకే..

ఎయిర్‌టెల్ సంస్థ ఇప్ప‌టికే త‌న పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు ప‌లు ఉచిత సేవ‌ల‌ను అందిస్తోంది. రూ.4వేలు విలువ క‌లిగిన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్లాన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. దీన్ని కూడా వినియోగ‌దారులు యాప్‌లో రిడీమ్ చేసుకోవ‌చ్చు. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చాల‌నే ఉద్దేశంతో ఎయిర్‌టెల్ ఈ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేవ‌లం టెలికాం సేవ‌ల‌ను మాత్ర‌మే కాకుండా, ఇత‌ర థ‌ర్డ్ పార్టీ సేవ‌ల‌ను సైతం అందిస్తూ క‌స్ట‌మ‌ర్ల‌కు ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే జియో, వీఐ వంటి సంస్థ‌లు సైతం ఈ విధ‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. జియోలో జెమిని ప్రొ, కాన్వా ప్రొ వంటి సేవ‌లు అందుబాటులో ఉండ‌గా, ప‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌కు వీఐ ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది.

ఏమేం స‌దుపాయాలు ఉన్నాయి..

ఐక్లౌడ్ ప్ల‌స్‌లో భాగంగా వినియోగ‌దారులు త‌మ యాపిల్ డివైస్‌ల మ‌ధ్య క్లౌడ్ స్టోరేజ్‌, డేటా ట్రాన్స్‌ఫ‌ర్‌, బ్యాక‌ప్ వంటి ఫీచ‌ర్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫొటోలు, ఫైల్స్, పాస్ వ‌ర్డ్‌లు, కాంటాక్ట్‌ల‌ను కూడా స్టోర్ చేసుకోవ‌చ్చు. యాపిల్ టీవీ ద్వారా యాపిల్ ఒరిజిన‌ల్ మూవీలు, సిరీస్‌ల‌ను వీక్షించ‌వ‌చ్చు. యాపిల్ ఆర్కేడ్ స‌హాయంతో ప‌లు పెయిడ్ గేమ్స్‌ను ప్ర‌క‌ట‌న‌లు లేకుండా ఉచితంగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. అలాగే ప‌లు యాప్స్‌కు కూడా ప్రీమియం యాక్సెస్ ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్‌ను ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్ర‌స్తుత క‌స్ట‌మ‌ర్ల‌తోపాటు కొత్త వినియోగ‌దారులు కూడా పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement