AI In Gmail | జీమెయిల్‌లో ఇక ఏఐ.. ఈజీగా మెయిల్స్ పంపించుకోవచ్చు..!
AI In Gmail | ప్రస్తుతం ఏ రంగంలో చూసినా ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ప్రజల పనులు మరింత సులభంగా, వేగంగా పూర్తవుతున్నాయి. ఇక ఏఐ రాకతో అన్ని పనులను మరికాస్త ఈజీగా పూర్తి చేసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఏఐని అనేక పనులకు ఉపయోగిస్తున్నారు.
Technology | Published On Jan 11, 2026, 9.27 am IST
AI In Gmail | ప్రస్తుతం ఏ రంగంలో చూసినా ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ప్రజల పనులు మరింత సులభంగా, వేగంగా పూర్తవుతున్నాయి. ఇక ఏఐ రాకతో అన్ని పనులను మరికాస్త ఈజీగా పూర్తి చేసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఏఐని అనేక పనులకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై జీమెయిల్‌లో కూడా ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీంతో మెయిల్స్ ను చదవడం, పంపించుకోవడం మరింత సులభతరం కానుంది. చాలా ఈజీగా కొన్ని నిమిషాల్లోనే ఈ పనులను పూర్తి చేసుకోవచ్చు. గూగుల్ తన జీమెయిల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సేవలను అందిస్తుందని జీమెయిల్ వీపీ ఆఫ్ ప్రొడక్ట్ బ్లేక్ బార్న్స్ తెలిపారు.
ఏఐ ఓవర్ వ్యూస్..
జీమెయిల్ ను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఉపయోగిస్తున్నట్లు బ్లేక్ వెల్లడించారు. ఇందులో ఇకపై ఏఐ సదుపాయాలను కూడా అందించనున్నామని వివరించారు. స్మార్ట్ రిప్లైలు, స్పామ్ ఫిల్టరింగ్, మెసేజెస్ సమ్మరైజ్, కంపోజింగ్ అసిస్ట్, మెయిల్స్ ప్రియారిటీ వంటి పవర్‌ఫుల్ సేవలను జీమెయిల్‌లో ఏఐ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. జీమెయిల్‌లో ఏఐ ద్వారా ఏఐ ఓవర్‌వ్యూస్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు చాలా ఎక్కువ సారాంశం ఉన్న మెయిల్స్‌ను కూడా చాలా సులభంగా పరిశీలించి ఆ మెయిల్స్‌లో ఏముందో తెలుసుకోవచ్చు. చాలా ఎక్కువ మ్యాటర్ ఉండే మెయిల్స్‌ను చదవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పైగా సమయం కూడా పడుతుంది. అయితే జీమెయిల్‌లో ఏఐ ఓవర్‌వ్యూస్ అనే ఫీచర్ సహాయంతో ఆ మెయిల్ మొత్తాన్ని ఏఐ చదివేలా చేయవచ్చు. దీంతో ఆ మెయిల్‌లో ఉండే వివరాలను క్లుప్తంగా తెలియజేయమని ఏఐని అడిగితే సరిపోతుంది. అందులో ఉండే ముఖ్యమైన వివరాలను ఏఐ తెలియజేస్తుంది. దీంతో ఆ వివరాలను బట్టి మనం కావాలనుకుంటే మళ్లీ ఏఐ సహాయంతోనే మెయిల్ కు రిప్లై ఇవ్వవచ్చు. ఇందుకు గాను జీమెయిల్‌లో హెల్ప్ మి రైట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు.

హెల్ప్ మి రైట్..
యూజర్లు జీమెయిల్‌లో అవతలి వ్యక్తులకు ఏదైనా మెయిల్ పంపాలని అనుకుంటే అందుకు ఏఐ సహాయం తీసుకోవచ్చు. ఈ క్రమంలో మెయిల్స్‌ను రాసేందుకు హెల్ప్ మి రైట్ అనే ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ తనకు కావల్సిన సందేశాలను ఏఐకి చెబితే దాంతో ఏఐ మెయిల్‌ను క్రియేట్ చేస్తుంది. అనంతరం యూజర్ దాన్ని పరిశీలించి అంతా బాగుందనుకుంటే వెంటనే ఆ మెయిల్ ను పంపించుకోవచ్చు. ఇలా హెల్ప్ మి రైట్ ఫీచర్ పనిచేస్తుంది. అలాగే ఏదైనా ఒక మెయిల్‌కు త్వరగా లేదా తక్కువ పదాలతో రిప్లై ఇవ్వాలనుకుంటే జీమెయిల్‌లో సజెస్టెడ్ రిప్లైస్ అనే ఏఐ ఫీచర్‌ను వాడుకోవచ్చు. దీని వల్ల అవతలి వారికి మనం పంపాలనుకున్న మెయిల్ చాలా వేగంగా, ఎలాంటి తప్పులు లేకుండా సెండ్ అవుతుంది.
ప్రూఫ్ రీడ్..
ఇక జీమెయిల్ లో అందిస్తున్న ఏఐ ఫీచర్లలో భాగంగా ప్రూఫ్ రీడ్ అనే సదుపాయం కూడా లభిస్తోంది. యూజర్లు తాము ప్రిపేర్ చేసే మెయిల్స్‌లో ఏమైనా తప్పులు ఉన్నాయా అనే విషయాన్ని ఈ ఫీచర్ సహాయంతో తెలుసుకోవచ్చు. దీని వల్ల మెయిల్స్‌లో తప్పులు లేకుండా చూసుకోవచ్చు. జీమెయిల్‌లో అంతర్గతంగా ఉండే లాంగ్వేజ్ టూల్ యూజర్లు ప్రిపేర్ చేసే మెయిల్స్‌ను పూర్తిగా చదివి వాటిల్లో ఉండే అక్షర దోషాలు, గ్రామర్ దోషాలను సరిచేస్తుంది. దీని వల్ల మనం క్రియేట్ చేసే మెయిల్స్‌లో తప్పులు దొర్లకుండా ఉంటాయి. అలాగే జీమెయిల్‌లో ఏఐ ఇన్ బాక్స్ పేరిట మరో నూతన ఏఐ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. దీని వల్ల యూజర్లకు వచ్చే మెయిల్స్ చాలా వరకు ఫిల్టర్ అవుతాయి. వారికి అత్యంత ప్రాధాన్యమైన మెయిల్స్ మాత్రమే ఈ బాక్స్‌లో కనిపిస్తాయి. దీంతో ముఖ్యమైన మెయిల్స్ మిస్ అవకుండా ఉంటాయి. ఇలా జీమెయిల్‌లో ఉండే ఏఐ ఫీచర్లు పనిచేస్తాయి.
కాగా జీమెయిల్‌లో ఈ ఏఐ ఫీచర్లను గూగుల్‌కు చెందిన జెమిని 3 మోడల్ ఆధారంగా అందిస్తున్నారు. వీటిల్లో కొన్ని ఫీచర్లు యూజర్లు అందరికీ లభిస్తుండగా, మరికొన్ని మాత్రం జెమిని ప్రొ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే అతి త్వరలోనే అన్ని ఫీచర్లను పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెస్తామని బ్లేక్ బార్న్స్ వెల్లడించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






