Dasyam Vinay Bhaskar | కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు : దాస్యం వినయ్ భాస్కర్
Dasyam Vinay Bhaskar | కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం ఆదివారం ఉద్యోగ కార్మిక హక్కుల సాధన కోసం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు.
Dasyam Vinay Bhaskar | కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం ఆదివారం ఉద్యోగ కార్మిక హక్కుల సాధన కోసం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామికులు దశాబ్దాల పోరాటాల ద్వారా, రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" ముసుగులో కార్మికుల జీవితాలను "ఈజ్ ఆఫ్ ఫైరింగ్"గా మార్చేస్తోందని మండిపడ్డారు. వంద ఏళ్ల కిందట పోరాడి 29 కార్మిక చట్టాలను సాధించడం జరిగిందని, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్యోగ, కార్మికులు ఎంత వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. పాత కార్మిక చట్టాల రద్దు పూర్తిగా కార్మిక సంక్షేమ వ్యతిరేక చర్యగా విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు నూతన చట్టాలను తీసుకొచ్చి కార్మిక, ఉద్యోగులకు కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రైతులను, కార్మికులను నూతన చట్టాల పేరుతో మోసం చేయాలని ప్రయత్నిస్తోందని వివరించారు. కేంద్రం నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక కోడ్‌ల కారణంగా కార్మికులు కనీసం వేతనం, సెలవులు, నిరసన చేసే హక్కులను సైతం కోల్పోతున్నారన్నారు. నూతన కార్మిక చట్టాల కారణంగా చిన్న తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారి పూర్తి హక్కులను కోల్పోతారని, 8 గంటల పని విధానంపోయి నిర్బంధ 12 గంటల విధానం రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులు వారి హక్కుల కోసం నిరసన, ధర్నాలు చేయకుండా, వారిని ఉద్యోగాల్లోంచి తొలగించడం, పరిహారం కోసం అడిగే హక్కు లేకుండా చేసే విధంగా నూతన కార్మిక చట్టాలను కేంద్రం ప్రభుత్వం రూపొందించిందని ఆరోపించారు. ఉద్యోగ, కార్మిక, కర్షకులు హక్కులకు రక్షణ కల్పించాలి, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెస్తే రైతులు ఉద్యమానికి తలవంచిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడం జరిగిందని, ఆ రైతుల ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంపై పోరాడుదామన్నారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. హక్కుల కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చిందని.. నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమని తెలంగాణ సర్కారు తీర్మానించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ కార్మికులకు క్షమాపణ చెప్పి పార్లమెంటులో ఆమోదపరిచిన బిల్లులను ఏ విధంగా రద్దు చేసుకున్నారో అదే విధంగా ఈ కార్మిక చట్టాలను సైతం వెనక్కి తీసుకోవలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ నాలుగు కార్మిక చట్టాల రద్దు కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్మికుల కోసం సదస్సును నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలల్లో కార్మికుల పక్షాన సదస్సు నిర్వహించనున్నట్లు, దానిలో భాగంగా హనుమకొండ జిల్లా సదస్సును దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్యోగుల, కార్మికుల పొట్టకొడుతోందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫఫిట్స్ సైతం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల కారణంగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






