త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | కేవ‌లం రూ. 6 వేల‌తోనే మీ పిల్ల‌ల‌ను కోటీశ్వ‌రులు చేయొచ్చు..! అదేలాగో తెలుసా..?

Mutual Funds | త‌మ పిల్ల‌ల‌ను నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే కాదు.. వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల‌ని అనుకుంటారు. ఈ రెండింటితోనే ఆగిపోరు.. త‌మ‌లాగా పేదరికంలో జీవించొద్ద‌నే ఉద్దేశంతో.. కోటీశ్వ‌రుల‌ను చేయాల‌ని క‌ల‌లు కంటుంటారు.

S

Business | Published On Jan 11, 2026, 7.02 pm IST

Mutual Funds | కేవ‌లం రూ. 6 వేల‌తోనే మీ పిల్ల‌ల‌ను కోటీశ్వ‌రులు చేయొచ్చు..! అదేలాగో తెలుసా..?
Advertisement

Mutual Funds | త‌మ పిల్ల‌ల‌ను నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే కాదు.. వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల‌ని అనుకుంటారు. ఈ రెండింటితోనే ఆగిపోరు.. త‌మ‌లాగా పేదరికంలో జీవించొద్ద‌నే ఉద్దేశంతో.. కోటీశ్వ‌రుల‌ను చేయాల‌ని క‌ల‌లు కంటుంటారు. కానీ ఒక ప్లానింగ్ మాత్రం ఉండ‌దు. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళ్తే.. చ‌దువుల‌కు ఖ‌ర్చులు పోనూ.. పిల్ల‌లు పెద్ద‌గా అయ్యే లోపు వారిని కోటీశ్వ‌రుల‌ను చేయొచ్చు. అదేలాగో తెలుసుకుందాం.

పిల్ల‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసేందుకు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. భారీ పెట్టుబ‌డులు పెట్టాల్సిన ప‌ని కూడా లేదు. కేవ‌లం క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌రం. అంతేకాదు.. స‌మ‌య పాల‌న కూడా ముఖ్య‌మే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే.. కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టొచ్చు. ఇదంతా కేవ‌లం రూ. 6 వేల‌తోనే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేవ‌లం రూ. 6 వేల‌తో కోటీశ్వ‌రులు ఎలా కావొచ్చు అనే సందేహం మీలో క‌ల‌గొచ్చు. మీ సందేహాల‌కు ఇదే స‌మాధానం. కేవలం నెలకు రూ. 6,000 పొదుపు చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) లేదా ఇతర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మీ బిడ్డ భవిష్యత్తును అత్యంత భ‌ద్రంగా సెటిల్ చేయొచ్చు.

ఉన్నత చదువుల కోసం (Higher Education)..

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి పేరెంట్ త‌మ బిడ్డ‌ను గొప్ప‌గా చ‌దివించాల‌ని ఆరాట ప‌డుతున్నారు. ఈ చ‌దువుల కోసం ల‌క్ష‌ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే ఈ ఉన్న‌త చ‌దువుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స‌రికొత్త ప‌థ‌కాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. 'HDFC Children's Gift Fund' వంటి చిల్డ్రన్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ (mutual funds).

పెట్టుబడి: నెలకు రూ. 6,000
టెన్యూవర్: 18 ఏళ్లు
మొత్తం పెట్టుబడి: రూ. 13 లక్షలు
రిటర్న్స్: 12% (అంచనా)
మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ. 43 లక్షలు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్ (Post Graduation)

డిగ్రీ వ‌ర‌కు పిల్ల‌ల‌ను అంద‌రూ స్వ‌దేశంలోనే చ‌దివిస్తారు. ఇక పీజీ అదేనండి ఎంఎస్ చేయించాల‌నుకున్న‌ప్పుడు చాలా మంది విదేశాల వైపు మొగ్గు చూపుతారు. అంటే త‌మ బిడ్డ‌కు 22 ఏండ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు భారీ మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఇందుకోసం Gold Mutual Funds లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

పెట్టుబడి: నెలకు రూ. 6,000
టెన్యూవర్ : 22 ఏళ్లు
రిటర్న్స్: 10% (అంచనా)
మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ. 54 లక్షలు.

పెళ్లి లేదా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (The Crorepati Plan)

ఇక ఉన్న‌త చ‌దువులు అయిపోగానే త‌మ పిల్ల‌ల‌కు పెళ్లిళ్లు చేయ‌డానికి సిద్ధ‌మవుతారు. కొంద‌రు పెళ్లిళ్ల‌కు ఇబ్బంది ప‌డ‌రు. అలాంటి వారు త‌మ బిడ్డ‌ను కోటీశ్వ‌రుడిని చేయాల‌ని ప్లానింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారు కొంత రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. ఇక కోటీశ్వ‌రుడి కావాల‌నే కోరిక ఉన్న వారు.. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ (Flexi Cap mutual funds) లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

పెట్టుబడి: నెలకు రూ. 6,000
టెన్యూవర్: 25 ఏళ్లు
మొత్తం పెట్టుబడి: రూ. 18 లక్షలు
రిటర్న్స్: 14% (అంచనా)
మెచ్యూరిటీ అమౌంట్: అక్షరాలా రూ. 1.40 కోట్లు!

Advertisement

తాజావార్తలు

Advertisement