Acer Iconia iM11 5G | బడ్జెట్ ధరకే 5జి ట్యాబ్‌ను లాంచ్ చేసిన ఏసర్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Acer Iconia iM11 5G | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఏసర్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్ ఐకానియా ఐఎం11 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రొడక్టివిటీని అందించేలా, సాధారణ యూజర్లకు ఎంటర్‌టెయిన్‌మెంట్, రోజువారి పనుల కోసం ఈ ట్యాబ్‌ను లాంచ్ చేసినట్లు సంస్థ తెలిపింది.
Technology | Published On May 7, 2026, 4.26 pm IST
Acer Iconia iM11 5G | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఏసర్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్ ఐకానియా ఐఎం11 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రొడక్టివిటీని అందించేలా, సాధారణ యూజర్లకు ఎంటర్‌టెయిన్‌మెంట్, రోజువారి పనుల కోసం ఈ ట్యాబ్‌ను లాంచ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఏసర్ ఐకానియా ఐఎం11 ట్యాబ్‌లో 11.45 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా కనిపిస్తుంది. 450 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. స్టైలస్ సపోర్ట్‌ను అందించారు. మీడియాటెక్ ఎంటీ8791 ప్రాసెసర్ ఉంది. ఏఐ పనుల కోసం ప్రత్యేకంగా ఏఐ ప్రాసెసింగ్ యూనిట్ (ఏపీయూ)ను ఇచ్చారు. అందువల్ల ఏఐ ఆధారిత పనులు చాలా వేగంగా పూర్తవుతాయి.
భారీ బ్యాటరీ, పీడీ ఫాస్ట్ చార్జింగ్..
ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. 5జి, 4జి ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ సదుపాయాలను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పవర్ బటన్‌లో అమర్చారు. ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. మరో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్ కూడా వెనుక వైపు ఉంది. 7400 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఈ ట్యాబ్‌కు పీడీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నందున దీన్ని వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
స్లిమ్ మెటల్ బాడీ, 5జి సేవలు..
ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఆడియో కోసం పవర్‌ఫుల్ క్వాడ్ స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. స్లిమ్ మెటల్ బాడీని కలిగి ఉంటుంది కనుక డివైస్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. సిమ్ కోసం ప్రత్యేక స్లాట్ ఉంది. అందువల్ల సిమ్ కార్డు వేసి 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎంఐ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు. బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు.
ఏసర్ ఐకానియా ఐఎం11 ట్యాబ్ ప్రారంభ ధర రూ.25,499 ఉండగా, దీన్ని ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఏసర్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
అక్టోబర్ 12, 2026

Amazon Layoffs | గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వేళ.. ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్
అక్టోబర్ 8, 2026

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Sapta Matrukalu | రాక్షస సంహారంలో జగన్మాతకు అండగా నిలిచిన సప్తమాతృకలు ఎవరు?
- ●KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్
- ●Manne Krishank | సీఎం రేవంత్ కూతురు స్కూల్లో ఫీజెంత తెలుసా?: మన్నె క్రిశాంక్
- ●Nobel Prize Economics 2026 | ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్: రాబర్ట్ ఇ.హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్లను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
- ●Jantar Mantar Protest Site Denotified | జంతర్ మంతర్ వద్ద ఇక ధర్నాలు బంద్: నిరసనలకు 3 కొత్త వేదికలను ఖరారు చేసిన ఢిల్లీ పోలీసులు
- ●Cyber Crime | 'నో' అంటే.. ఖాతా ఖాళీ! ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!

Sapta Matrukalu | రాక్షస సంహారంలో జగన్మాతకు అండగా నిలిచిన సప్తమాతృకలు ఎవరు?

KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్

Manne Krishank | సీఎం రేవంత్ కూతురు స్కూల్లో ఫీజెంత తెలుసా?: మన్నె క్రిశాంక్

Nobel Prize Economics 2026 | ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్: రాబర్ట్ ఇ.హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్లను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం


