త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OMA Vs ZIM | ఒమ‌న్‌ను వ‌ణికించిన జింబాబ్వే బౌల‌ర్లు.. ఎనిమిది వికెట్ల తేడాతో విజ‌యం..!

OMA Vs ZIM | బ్రియాన్ బెన్నెట్ బ్యాటింగ్‌కి తోడు, క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో ఒమన్‌ను జింబాబ్వే ఎనిమిది వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ బీ మ్యాచ్‌లో కొలంబో ఎస్ఎస్‌సీ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 19.5 ఓవర్లలో ఒమన్ జట్టును 103 పరుగులకే ఆలౌట్ చేసింది. 13.3 ఓవర్లలో రెండు వికెట్ల న‌ష్టానికి 106 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.

P

Sports | Published On Feb 9, 2026, 7.06 pm IST

OMA Vs ZIM | ఒమ‌న్‌ను వ‌ణికించిన జింబాబ్వే బౌల‌ర్లు.. ఎనిమిది వికెట్ల తేడాతో విజ‌యం..!
Advertisement

OMA Vs ZIM | బ్రియాన్ బెన్నెట్ బ్యాటింగ్‌కి తోడు, క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో ఒమన్‌ను జింబాబ్వే ఎనిమిది వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ బీ మ్యాచ్‌లో కొలంబో ఎస్ఎస్‌సీ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 19.5 ఓవర్లలో ఒమన్ జట్టును 103 పరుగులకే ఆలౌట్ చేసింది. 13.3 ఓవర్లలో రెండు వికెట్ల న‌ష్టానికి 106 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.

చివరి వరకు నిలిచిన బెన్నెట్‌..

104 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వేకు బెన్నెట్, తాదివనాషే మరుమణి మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 30 ర‌న్స్ జోడించారు. 11 బంతుల్లో 21 రన్స్ చేసిన మ‌రుమాణిని సుఫ్యాన్ మహ్మద్ అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో సుఫ్యాన్ డియాన్ మయర్స్‌ను డ‌కౌట్ చేశాడు. బెన్నెట్.. బ్రెండన్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. ఈ జోడీ 68 రన్స్ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత టేల‌ర్ గాయం కార‌ణంగా రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. బెన్నెట్ చివరవరకు నిలిచినా హాఫ్ సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. చివర్లో కెప్టెన్ సికందర్ రాజా బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. బెన్నెట్ 36 బంతుల్లో 48 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. రాజా 2 బంతుల్లో 5 రన్స్ చేసి నాటౌట్ నిలిచాడు. సుఫ్యాన్‌కు రెండు వికెట్లు ద‌క్కాయి.

ఒమ‌న్‌కు క‌ష్టాలు..

తొలుత బ్యాటింగ్ చేసిన ఒమ‌న్‌కు క‌లిసిరాలేదు. కెప్టెన్ జతిండర్ సింగ్‌ను ముజరాబాని అవుట్ చేశాడు. నాగర్వా హమాద్ మిర్జాను ఖాతా తెరువ‌కుండానే పెవిలియ‌న్‌కు పంపాడు. ముజరాబాని అద్భుతమైన బౌలింగ్ కొన‌సాగించాడు. అమీర్ క‌లీమ్‌, క‌ర‌ణ్‌ను సైతం త‌క్కువ స్కోర్‌కే అవుట్‌చేశాడు. ఒమ‌న్ 27 రన్స్‌కు కీల‌క ఐదు వికెట్లు కోల్పోయింది. సుఫ్యాన్‌, వినాయ‌క్ శుక్లా, చివ‌ర‌లో న‌దీమ్ ఖాన్ పోరాడ‌డంతో ఒమ‌న్ స్కోర్ వంద దాటింది. శుక్లా 21 బంతుల్లో 28 ర‌న్స్‌, సుఫ్యాన్ 21 బంతుల్లో 28 రన్స్, న‌దీమ్ ఖాన్ 18 బంతుల్లో 20 రన్స్ చేసి అవుట్ అవుట్ అయ్యారు. జింజాబ్వే బౌల‌ర్ల‌లో రిచర్డ్ న్గారావా, బ్లెసింగ్ ముజరాబాని, బ్రాడ్ ఎవాన్స్ త‌లో మూడు వికెట్లు తీయ‌గా.. సికందర్ ర‌జాకు ఒక వికెట్ ద‌క్కింది.

Advertisement
Advertisement