Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత
Food Poisoning | మహారాష్ట్రలోని ముంబైలో పెండ్లి విందులో (Wedding Feast) కల్తీ ఆహారం కలకలం (Food Poisoning) రేపింది. వివాహ వేడుకలో విందు భోజనం చేసిన అతిథులు అస్వస్థతకు గురయ్యారు.
Wedding Feast | త్రినేత్ర న్యూస్: మహారాష్ట్రలోని ముంబైలో పెండ్లి విందులో (Wedding Feast) కల్తీ ఆహారం కలకలం (Food Poisoning) రేపింది. వివాహ వేడుకలో విందు భోజనం చేసిన అతిథులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నవదంపతులు సహా మొత్తం 30 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ దవాఖానలో చేరారు.
ముంబైలోని భండుప్ (Bhandup) ప్రాంతంలో ఓ వివాహ వేడుక (Wedding celebration) జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆరగించిన తర్వాత అతిథులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో పెండ్లి కొడుకు, వధువు కూడా ఉన్నారు. దీంతో ఇరు కుటుంబాల వారు బాధితులను ములంద్‌లోని ఎంటీ అగర్వాల్ మున్సిపల్ జనరల్ దవాఖానకు తరలించారు. మొత్తం 27 మంది వాంతులు, విరేచనాలతో దవాఖానలో చేరారని వైద్యులు తెలిపారు. వారిలో కొందరు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారని వెల్లడించారు. బాధితుల్లో 11 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. వారందరికి చికిత్స అందించామని, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
కాగా, క్యాటరింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆహారం తిన్న తరువాత మహిళలు, పిల్లలు వామ్టింగ్ చేసుకోవడం మొదలుపెట్టారని వధువు తరఫు బంధువులు చెప్పారు. పోలీసులు, ఎఫ్‌డీఏ ఈ ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా – ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం
అక్టోబర్ 29, 2026

Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ
అక్టోబర్ 26, 2026

Navi Mumbai Airport | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: నవీ ముంబై కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ షిఫ్ట్
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం
- ●TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం
- ●Horoscope | నవంబర్ 2 రాశిఫలాలు.. తోబుట్టువులతో అపార్థాలు రావచ్చు!
- ●KTR Rythu Garjana Adilabad | ఎకరానికి రూ.60 వేలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయ్

Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం

Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం

TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం



