Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన 1,741 ఇళ్లను ప్రభుత్వం మాప్‌అప్ ఈ-లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించింది. బుధవారం 14 నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రక్రియ నిర్వహించి అర్హులను ఎంపిక చేసింది. ఖాళీగా ఉన్న ఇళ్లకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్ లిస్ట్ కోసం ఎంపిక చేసింది.
- 14 నియోజకవర్గాల్లో ఈ-లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక..
- మరో 875 మందితో వెయిటింగ్ లిస్ట్
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన 1,741 ఇళ్లను ప్రభుత్వం మాప్‌అప్ ఈ-లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించింది. బుధవారం 14 నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రక్రియ నిర్వహించి అర్హులను ఎంపిక చేసింది. ఖాళీగా ఉన్న ఇళ్లకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్ లిస్ట్ కోసం ఎంపిక చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలివైపు ఉన్న క్యూర్ ప్రాంతంలోని అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇళ్లు కావాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టింది. తొలివిడత పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతోంది.
అయితే, ఇళ్ల కేటాయింపు అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు అనర్హులుగా తేలారు. అలాగే ఎంపికైన వారిలో మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కేటాయింపులను రద్దు చేసుకున్నారు. దీంతో 14 నియోజకవర్గాల పరిధిలో 1,741 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇళ్లను బుధవారం నిర్వహించిన మాప్‌అప్ ఈ-లాటరీ ద్వారా కొత్త లబ్ధిదారులకు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్‌లో 80, మల్కాజిగిరిలో 150, కూకట్‌పల్లిలో 59, సనత్‌నగర్‌లో 88, కంటోన్మెంట్‌లో 66, బహదూర్‌పురలో 91, కార్వాన్‌లో 73, మేడ్చల్‌లో 143 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే నాంపల్లిలో 106, మలక్‌పేటలో 171, మహేశ్వరంలో 201, రాజేంద్రనగర్‌లో 133, ఖైరతాబాద్‌లో 327, అంబర్‌పేటలో 53 ఇళ్లను కేటాయించారు.
ఇదిలా ఉండగా, ఖాళీగా ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్ లిస్ట్ కోసం ఈ-లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఎంపికైన వారందరికీ ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించారు. త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల వివరాలను పరిశీలించి నిర్ధారించనున్నారు. ఈ మాప్ అప్ లాటరీ ప్రక్రియలో హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?
- ●Water Crisis | నీళ్లు.. ఎండమావులు
- ●Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య
- ●Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- ●Rythu Bharosa Fake Messages | రైతు భరోసా డబ్బులు జమయ్యాయా? ఆ మెసేజ్‌లను అస్సలు నమ్మకండి
- ●Neha Shetty | ఐటెం సాంగ్‌లో నేహా శెట్టి

Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?

Water Crisis | నీళ్లు.. ఎండమావులు

Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య

Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి



