Water Crisis | నీళ్లు.. ఎండమావులు
Water Crisis | చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. జలమండలి విడుదల చేసే నీళ్ల ఫ్లో తగ్గిపోయింది. జలమండలి ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగి.. బుక్ చేసిన వారం తర్వాత గానీ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ప్రైవేట్ బోర్లను ప్రభుత్వం సీజ్ చేస్తూ ఉండడంతో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేయడం లేదు.
భాగ్యనగరంలో నీటి కటకట
ఇప్పటికే ప్రారంభమైన వెతలు
చేతులెత్తేసిన ప్రభుత్వం
ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్న జనం
సెలవులు ప్రకటిస్తున్న విద్యాసంస్థలు
అయిదు రోజుల పనిదినాలు కావాలంటున్న ప్రభుత్వోద్యోగులు
మూసివేత దిశగా హాస్టళ్లు..
జలమండలి సప్లై చేస్తున్న నీళ్లు తక్కువగా వస్తున్నాయి. జలమండలి ట్యాంకర్లకు కూడా డిమాండ్ పెరిగింది. ప్రైవేటు ట్యాంకర్లు దొరకడం కష్టంగా మారింది. కాబట్టి అపార్టుమెంట్ వాసులు నీటిని పొదుపు చేయండి. ఉదయం 3 గంటలు మధ్యాహ్నం 3 గంటలు నీళ్లు ఆపివేస్తాం. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించగలరు.
- ఓ గేటెడ్ కమ్యూనిటీ వాట్సాప్‌లో మెసేజ్ సారాంశం
హైదరాబాద్‌లో నీటికి బాగా కొరత ఏర్పడింది. ట్యాంకర్లు రావడం లేదు. కాబట్టి ఇంటర్ విద్యార్థులందరినీ ఇంటికి పంపుతున్నాం. వాళ్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తాం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరు.
- ఓ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీ వాట్సాప్ అలర్ట్
ప్రభుత్వానికి మనవి. తాగునీటికి బాగా ఇబ్బంది ఏర్పడినందున అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజులు పనిదినాలు ఉండేలా నిర్ణయం తీసుకోగలరు. 5 రోజుల పనిదినాలతో నీటిని పొదుపు చేసే అవకాశం ఉంది.
- ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్తప్తి
Water Crisis | త్రినేత్ర న్యూస్ : చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. జలమండలి విడుదల చేసే నీళ్ల ఫ్లో తగ్గిపోయింది. జలమండలి ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగి.. బుక్ చేసిన వారం తర్వాత గానీ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ప్రైవేట్ బోర్లను ప్రభుత్వం సీజ్ చేస్తూ ఉండడంతో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేయడం లేదు. కొన్ని ప్రైవేట్ హాస్టళ్లు ..తగినంత నీటి సరఫరా లేకపోవడంతో నిర్వహణ వీలుగాక మూసివేత దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అటు జలమండలి నుంచి సరిపడా నీళ్లు సరఫరా కాక.. ఇటు ప్రైవేటు ట్యాంకర్లు మూసివేయడంతో నగరంలో తాగునీటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఆందోళనకరంగా అక్కంపల్లి రిజర్వాయర్
నగర తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం అక్కంపల్లి రిజర్వాయర్ (నాగార్జున సాగర్ కృష్ణా జలాలు) నుండి రోజూ దాదాపు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలకు కృష్ణా ఫేజ్ 1, 2, 3 ద్వారా ప్రతి నెలా సుమారు 1.38 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ గ్రిడ్ కోసం ఈ రిజర్వాయర్ ద్వారా రోజుకు దాదాపు 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్లకు నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో దాదాపు 1.32 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అక్కంపల్లి రిజర్వాయర్ ఆధారపడి ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీ లెవల్‌కు చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీంతో వచ్చే వేసవి వరకు జలమండలి సరిపడా నీటిని సరఫరా చేయగలదా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆశలన్నీ ఎల్లంపల్లిపైనే
గోదావరి బేసిన్‌లో ఉన్న సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి రిజర్వాయర్లు నగరానికి దాదాపు సగానికి పైగా నీటి డిమాండ్‌ను తీరుస్తున్నాయి. వీటిలో కేవలం సింగూరు, మంజీరాల నుంచి రోజుకు 110 మిలియన్ గ్యాలన్లను హైదరాబాద్‌కు తరలించేవారు. కానీ ప్రస్తుతం ఆ రెండు జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిగా అడుగంటిపోవడంతో వాటి నుంచి సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఇక మిగిలిన ఆధారం శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే. ఈ రోజుకు కూడా ఆ రిజర్వాయరులో 17 టీఎంసీల నీళ్ల ఉండడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం ఈ జలాశయం నుంచి రోజుకు 163 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకుంటున్నారు. అయితే, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి సరఫరా ఆగిపోవడంతో ఎల్లంపల్లి నుండి అదనంగా మరో 50 ఎంజీడీల నీటిని పంపింగ్ చేసేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య
నవంబర్ 4, 2026

Sports Hub | క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు, ఉన్నత విద్యలో అవకాశాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 4, 2026

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు
- ●Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య
- ●Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- ●Rythu Bharosa Fake Messages | రైతు భరోసా డబ్బులు జమయ్యాయా? ఆ మెసేజ్‌లను అస్సలు నమ్మకండి
- ●Neha Shetty | ఐటెం సాంగ్‌లో నేహా శెట్టి

Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు

Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య

Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి



