Disha Patani | గ్లామర్ చూసి అంచనా వేయొద్దు.. నా అసలు స్వభావం వేరంటున్న బ్యూటీ..!
Disha Patani | సినిమాల్లో గ్లామరస్ పాత్రలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వేడుకల్లో స్టయిల్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకునే హీరోయిన్ దిశా పటానీ. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తే ఎప్పుడూ పార్టీల్లోనో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతూనో ఉంటారని అనిపిస్తుంది. అయితే, నిజ జీవితంలో తన వ్యక్తిత్వం అందుకు భిన్నమని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
Entertainment | Published On Nov 4, 2026, 8.01 pm IST
Disha Patani | సినిమాల్లో గ్లామరస్ పాత్రలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వేడుకల్లో స్టయిల్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకునే హీరోయిన్ దిశా పటానీ. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తే ఎప్పుడూ పార్టీల్లోనో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతూనో ఉంటారని అనిపిస్తుంది. అయితే, నిజ జీవితంలో తన వ్యక్తిత్వం అందుకు భిన్నమని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తెరపై కనిపించే గ్లామర్‌ను చూసి తన జీవనశైలిపై చాలామంది ఓ అభిప్రాయానికి వస్తున్నారని, కానీ తాను చాలా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతానని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిశా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. రెడ్ కార్పెట్ సెలబ్రేషన్స్, సోషల్ మీడియా ఫొటోలతో కనిపించే తనకు, నిజ జీవితంలో ప్రశాంతంగా ఇంట్లో గడపడమే ఇష్టమని తెలిపింది. ఖాళీ సమయం దొరికితే పార్టీలకు వెళ్లడం కంటే ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. ఫిట్‌నెస్ ట్రైనింగ్‌కు కూడా ఎక్కువ సమయం కేటాయిస్తానని వెల్లడించింది.
గ్లామర్ చూసి అలా అనుకోవద్దు..

Disha Patani
సోషల్ మీడియాలో తన ఫొటోలు చూసి తన వ్యక్తిత్వం గురించి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటారని దిశా తెలిపింది. గ్లామరస్‌గా కనిపించడం వల్ల తాను ఎప్పుడూ పార్టీలు, వేడుకల్లో మునిగితేలుతుంటాననే అభిప్రాయం ఏర్పడిందని చెప్పింది. కానీ తనకు హడావుడి కంటే ప్రశాంతమైన వాతావరణమే ఇష్టమని స్పష్టం చేసింది. తాను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటానని, అందరితో వెంటనే కలిసిపోలేనని పేర్కొంది. అయితే ఒకసారి పరిచయం ఏర్పడితే తనలోని మరో కోణం కనిపిస్తుందని.. ఎంతో ఉత్సాహంగా, భావోద్వేగాలతో, నవ్వుతూ సరదాగా గడిపే వ్యక్తినని వివరించింది.
ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యత..

Disha Patani
సినిమాల్లో తన గ్లామర్‌తో పాటు ఫిట్‌నెస్‌తోనూ దిశా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం తన దినచర్యలో భాగమని గతంలోనూ పలుమార్లు చెప్పింది. ఖాళీ సమయాన్ని కూడా ఎక్కువగా శిక్షణ, విశ్రాంతి కోసం ఉపయోగిస్తానని వెల్లడించింది. బయటకు కనిపించే తన గ్లామరస్ ఇమేజ్‌కు, వ్యక్తిగత జీవితంలోని సాధారణ అలవాట్లకు చాలా తేడా ఉందని ఆమె తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
సినిమాలతో గుర్తింపు..

Disha Patani
మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన దిశా పటానీ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాఘీ 2, భారత్, మలంగ్, యోధా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కల్కి 2898 ఏడీలోనూ కీలక పాత్రలో కనిపించింది. నటనతో పాటు తన ఫిట్‌నెస్, గ్లామర్‌తోనూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే, తెరపై కనిపించే తన రూపమే పూర్తి వ్యక్తిత్వం కాదని.. తనను దగ్గరగా తెలుసుకున్నప్పుడే అసలు దిశా ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Yukti Thareja | ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండీ టచ్.. యుక్తి తరేజా అందాల సందడి!
- ●Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?
- ●Water Crisis | నీళ్లు.. ఎండమావులు
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు
- ●Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య
- ●Ramchander Rao | ఓయూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Yukti Thareja | ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండీ టచ్.. యుక్తి తరేజా అందాల సందడి!

Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?

Water Crisis | నీళ్లు.. ఎండమావులు

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు






