Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా 400 కి.మీ సైకిల్ యాత్ర చేపట్టిన యువకులు.. ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసి ఎండిన పంట కంకులను చూపించారు.
సంక్షిప్త సారాంశం
సాగునీటి ఎద్దడి, రైతుల కష్టాలపై గోదావరిఖని యువకులు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 8 రోజుల పాటు 400 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహించారు. యాత్ర ముగింపు సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి గోదావరి జలాలు, ఎండిపోయిన వరి కంకులను అందజేశారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, కరెంట్ కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని కేసీఆర్‌కు యాత్రికులు వివరించారు. రైతుల గోడు విని స్పందించిన కేసీఆర్.. యువకుల ప్రయత్నాన్ని అభినందిస్తూ త్వరలోనే ప్రజా ఆకాంక్షలు నెరవేరుతాయని భరోసా ఇచ్చారు.
- కేసీఆర్‌కు ఎండిన వరి కంకులు చూపించిన గోదావరిఖని యువత
Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో సాగునీటి ఎద్దడి, పంటలు ఎండిపోయి రైతన్నలు పడుతున్న వేదనను తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకులు చేపట్టిన 400 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర ముగిసింది. గోదావరిఖని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో 10 మంది యువకుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 8 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించింది. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
రైతుల కన్నీళ్లు.. ఎండిన పంట కంకులు
యాత్ర పొడవునా పల్లెల్లో తాము చూసిన రైతుల దీనస్థితిని యువకులు కేసీఆర్‌కు కళ్లకు కట్టినట్లు వివరించారు. సరైన సమయానికి సాగునీరు అందక, కరెంట్ కోతలతో బోర్లు సైతం ఎండిపోయి పంట పొలాలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో రైతుల నుంచి సేకరించిన ఎండిపోయిన వరి కంకులను కేసీఆర్‌కు చూపించి, అన్నదాతల ఆవేదనను తెలియజేశారు. అలాగే వెంట తెచ్చిన పవిత్ర గోదావరి జలాలను కేసీఆర్‌కు అందజేశారు.
రైతులకు కేసీఆర్ పాలనే శరణ్యం
క్షేత్రస్థాయిలో రైతులు, మహిళలు, వివిధ కులవృత్తుల వారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని యాత్రికులు పేర్కొన్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో పుష్కలంగా నీరు, నిరంతర విద్యుత్‌తో వ్యవసాయం పండుగలా సాగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయం మళ్లీ గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి సీఎం కావడమే ఏకైక పరిష్కారమని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వారు అధినేత దృష్టికి తీసుకెళ్లారు.
యువకులకు కేసీఆర్ అభినందనలు
రైతుల సమస్యలను ప్రతిబింబిస్తూ ఎండనక, వాననక 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన యువత సంకల్పాన్ని కేసీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. క్షేత్రస్థాయి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఆయన, రైతాంగ కష్టాలు ఎల్లకాలం ఉండబోవని, ప్రజా ఆకాంక్షలు తప్పకుండా నెరవేరుతాయని వారికి భరోసా ఇచ్చారు.
ఈ సైకిల్ యాత్రలో బొడ్డు రవీందర్‌తో పాటు ఉప్పు రాజ్ కుమార్, కాసిపాక వాసు, ఆరేపల్లి సరీష్, మేకల నవీన్ కుమార్, పారిపల్లి అనిల్ కుమార్, గుండెవేన శ్రీనివాస్ యాదవ్, మంచినీళ్ల రాకేష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, అమ్ము కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Disha Patani | గ్లామర్ చూసి అంచనా వేయొద్దు.. నా అసలు స్వభావం వేరంటున్న బ్యూటీ..!
- ●Yukti Thareja | ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండీ టచ్.. యుక్తి తరేజా అందాల సందడి!
- ●Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?
- ●Water Crisis | నీళ్లు.. ఎండమావులు
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లకు మాప్‌అప్ లాటరీ.. 1,741 మందికి ఇళ్ల కేటాయింపు
- ●Woman Murder | పట్టపగలే కత్తిపోట్లు.. హైదరాబాద్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య

Disha Patani | గ్లామర్ చూసి అంచనా వేయొద్దు.. నా అసలు స్వభావం వేరంటున్న బ్యూటీ..!

Yukti Thareja | ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండీ టచ్.. యుక్తి తరేజా అందాల సందడి!

Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?

Water Crisis | నీళ్లు.. ఎండమావులు




