Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా – ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం
లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతుంది. బేటా బిల్డర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Oct 29, 2026, 3.50 pm IST
Bollywood | ఓ సినిమా రూపకల్పన వెనుక వేలాది మంది కష్టం ఉంటుంది. నటీనటులు, డైరెక్టర్, కెమెరామెన్ మొదలుకొని... 24 విభాగాలు కలిసి పనిచేస్తేనే సినిమా తయారవుతుంది. ఇందులో ఏ ఒక్క విభాగం లేకపోయినా సినిమా అసంపూర్తిగా మిగిలిపోతుంది. కానీ లోకేషన్లు, సెట్స్, కాస్ట్యూమ్స్‌తో చాలా విభాగాలు లేకుండా కేవలం నటీనటులతోనే ఏఐ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీ రాబోతుంది. బేటా బిల్డర్ అనే టైటిల్‌తో ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ హైబ్రీడ్ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మయూర్ మోర్, ఆశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
నటీనటులు ఉంటారు కానీ...
సాధారణ సినిమాలాగే హైబ్రీడ్ ఫీచర్ ఫిల్మ్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటారు. నటీనటులు ఉంటారు. కెమెరాతో వారి నటనను షూట్ చేస్తారు. షూటింగ్ టైమ్‌లోనే ఏఐ ప్రాంప్ట్‌లను వాడి బ్యాక్‌గ్రౌండ్‌లో తమకు కావాల్సిన లొకేషన్‌ను వర్చువల్ రియాలిటీలో క్రియేట్ చేస్తారు. భారీ సెట్స్ వేయకుండా...తాము అనుకున్న ఊహాజనీత ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల కాస్ట్యూమ్స్ కూడా ఏ ఆధారంగానే ఛేంజ్ చేస్తారు. కావాల్సిన డిజైన్, రంగును సెలెక్ట్ చేసుకుంటారు. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఏఐ టూల్స్ ఉపయోగించి విజువల్స్ ఎడిట్ చేయడం, కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను సినిమాకు జోడిస్తారు.
లిమిటెడ్ బడ్జెట్‌లో...
లిమిటెడ్ బడ్జెట్‌లో కేవలం ఒకే స్టూడియోలో బేటా బిల్డర్ షూటింగ్ మొత్తం పూర్తిచేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏఐ వీడియో కంపెనీ ఇన్వీడియా నిర్మిస్తోంది.
ఫ్యామిలీ మ్యాన్...
ఇందులో మయూర్ మోర్ ధారావి మురికివాడల ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నారు. బేటా బిల్డర్ సినిమా కంటే ముందు కోటా ఫ్యాక్టరీతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో నటించాడు. అశ్లేషా ఠాకూర్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ఫేమస్ అయ్యింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ
అక్టోబర్ 26, 2026

Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..
అక్టోబర్ 26, 2026

Navi Mumbai Airport | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: నవీ ముంబై కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ షిఫ్ట్
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
- ●Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
- ●South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
- ●Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
- ●Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
- ●Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే - పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!

South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు



