త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navdeep Drug Case | డ్ర‌గ్స్ కేసులో న‌వ‌దీప్‌కు క్లీన్ చీట్

డ్ర‌గ్స్ కేసు నుంచి న‌వ‌దీప్‌కు క్లీన్ చీట్ వ‌చ్చింది. డ్ర‌గ్ పెడ్ల‌ర్ల‌తో న‌వ‌దీప్‌కు సంబంధాలు ఉన్న‌ట్లు మూడేళ్ల క్రితం నార్కోటిక్ టీమ్ అత‌డిపై కేసును న‌మోదు చేశారు. ఈ కేసును శుక్ర‌వారం హైకోర్టు కొట్టివేసింది.

N

Entertainment | Published On Jan 9, 2026, 3.16 pm IST

Navdeep Drug Case | డ్ర‌గ్స్ కేసులో  న‌వ‌దీప్‌కు క్లీన్ చీట్
Advertisement

Navdeep Drug Case | టాలీవుడ్ న‌టుడు న‌వ‌దీప్ బిగ్ రిలీఫ్ ద‌క్కింది. డ్ర‌గ్స్ కేసు నుంచి క్లీన్ చీట్ వ‌చ్చింది. న‌వ‌దీప్‌పై పోలీసులు పెట్టిన డ్ర‌గ్స్ కేసును హైకోర్టు శుక్ర‌వారం కొట్టివేసింది. 2023లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కొంద‌రు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ల‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచార‌ణ‌లో న‌వ‌దీప్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. రామ్‌చంద్ అనే వ్య‌క్తితో న‌వ‌దీప్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు ఆరోప‌ణ‌లు చేశారు. అత‌డి వ‌ద్ద నుంచి న‌వ‌దీప్ డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైన‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసులో న‌వ‌దీప్‌ను 29వ నిందితుడిగా చేర్చుతూ అత‌డిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ కేసులో న‌వ‌దీప్‌తో పాటు డైరెక్ట‌ర్ సుశాంత్ రెడ్డితో పాటు వెంక‌ట‌ర‌త్నారెడ్డి, ర‌వి ఉప్ప‌ల‌పాటి తో పాటు మ‌రికొంద‌రిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కోర్టు తీర్పు....

ఈ డ్ర‌గ్స్ కేసుపై శుక్ర‌వారం కోర్టు తీర్పు ఇచ్చింది. న‌వ‌దీప్ వ‌ద్ద ఎలాంటి డ్ర‌గ్స్ దొర‌క‌లేద‌ని అత‌డి త‌ర‌ఫు న్యాయ‌వాది వెంక‌ట సిద్ధార్థ్ చేసిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. అత‌డిపై కేసును కొట్టివేసింది. ఈ కేసులో న‌వ‌దీప్‌కు వ్య‌తిరేకంగా పోలీసులు ఆధారాలు సేక‌రించ‌లేక‌పోయిన‌ట్లు స‌మాచారం. న‌వ‌దీప్‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. 2017లో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్ర‌గ్స్ కేసులో న‌వ‌దీప్ ప‌లుమార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ డ్ర‌గ్స్ కేసులో న‌వ‌దీప్‌తో పాటు ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, రానా ద‌గ్గుబాటి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ సెలిబ్రిటీల‌కు ఈడీ నోటీసులు పంపించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement