Crime Thriller OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన వెట్రిమారన్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ట్విస్ట్‌లను ఊహించడం కష్టమే|
తమిళ మూవీ మాస్క్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కెవిన్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Jan 9, 2026, 2.50 pm IST
Crime Thriller OTT | లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాస్క్ సడెన్‌గా ఓటీటీలో రిలీజైంది. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు విక్రమన్ అశోక్ దర్శకత్వం వహించారు. కెవిన్, ఆండ్రియా, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జీ5 ఓటీటీలో (Zee5 ott)రిలీజైంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తెలుగులోనూ మాస్క్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆండ్రియా నిర్మాత...
మాస్క్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా ఆండ్రియా వ్యవహరించింది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
మాస్క్ కథేమిటంటే?
వేలు (కెవిన్) ఓ ప్రైవేట్ డిటిక్టివ్. డబ్బు కోసం హ్యాకింగ్‌లాంటి ఇల్లీగల్ పనులు చేస్తుంటాడు. భూమి (ఆండ్రియా) అనాథ పిల్లల కోసం ఆశ్రమం నడుపుతుంటుంది. సంఘసంస్కర్తగా మంచి పేరు తెచ్చుకున్న భూమిలో ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంటుంది. రాజకీయ నాయకులకు బినామీగా వ్యవహరిస్తూ కబ్జాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతుంటుంది. భూమి దగ్గర ఓ పొలిటీషియన్ వందల కోట్ల బ్లాక్‌మనీ దాచిపెడతాడు. కానీ ఓ మాస్క్ మ్యాన్ ఆ డబ్బు కొట్టేస్తాడు. ఆ డబ్బు దొంగిలించింది ఎవరో తెలుసుకోవడానికి వేలు సాయం కోరుతుంది భూమి. ఈ కేసును వేలు ఎలా సాల్వ్ చేశాడు. భూమి దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసింది ఎవరు? భూమికి వరప్రభలక్ష్మికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
మాస్క్ మూవీకి కోలీవుడ్ అగ్ర దర్శకుడు నెల్సన్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ మూవీలోనే ఆండ్రియా నిర్మాతగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌తో కెరీర్‌ను ప్రారంభించి కెవిన్ ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. డాడా, స్టార్, లిఫ్ట్ సినిమాలతో విజయాలను అందుకున్నాడు. గత ఏడాది మాస్క్‌తో పాటు కిస్ సినిమాలు చేశాడు. నయనతారకు జోడీగా కెవిన్ నటించిన హాయ్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



