Uruguay Vs Cape Verde | ఉరుగ్వేకు షాక్.. నాకౌట్‌పై కన్నేసిన కేప్ వెర్డే
Uruguay Vs Cape Verde | ఫిఫా ప్రపంచకప్-2026లో తొలిసారి అరంగేట్రం చేసిన కేప్ వెర్డే జట్టు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రూప్-హెచ్‌లో ఉరుగ్వేతో 2-2తో డ్రా చేసుకుని నాకౌట్ దశ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 స్టేజ్‌కి చేరుకోవడమే తమ లక్ష్యమని కేప్ వెర్డే కోచ్ బుబిస్టా స్పష్టం చేశారు.
- 2-2 తేడాతో మ్యాచ్ డ్రా
- సౌదీపై గెలిస్తే రౌండ్ ఆఫ్ 32కి ఛాన్స్
Uruguay Vs Cape Verde | ఫిఫా ప్రపంచకప్-2026లో తొలిసారి అరంగేట్రం చేసిన కేప్ వెర్డే జట్టు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రూప్-హెచ్‌లో ఉరుగ్వేతో 2-2తో డ్రా చేసుకుని నాకౌట్ దశ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 స్టేజ్‌కి చేరుకోవడమే తమ లక్ష్యమని కేప్ వెర్డే కోచ్ బుబిస్టా స్పష్టం చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌ను గోల్స్ లేకుండా నిలువరించిన కేప్ వెర్డే.. తాజాగా మరో ఫుట్‌బాల్ దిగ్గజమైన ఉరుగ్వేపై కూడా పాయింట్ సాధించి తన సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానంలో ఉన్న ఈ చిన్న దేశం.. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో సౌదీ అరేబియాను ఎదుర్కోనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించేందుకు ఛాన్స్ ఉంది.
చరిత్రలో నిలిచిపోయేలా తొలి గోల్..
మ్యాచ్ 21వ నిమిషంలో కేప్ వెర్డే చరిత్రలో నిలిచిపోయే క్షణం వచ్చింది. కెవిన్ పినా అద్భుతమైన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి ప్రపంచకప్ చరిత్రలో కేప్ వెర్డే తరఫున తొలి గోల్ నమోదు చేశాడు. ఆ గోల్‌తో స్టేడియంలోని కేప్ వెర్డే అభిమానుల సంబరాలకు అవధులు లేకుండా పోయాయి. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. సీనియర్లు అయిన ఉరుగ్వే ఆటగాళ్లు వెంటనే పుంజుకుని బదులిచ్చారు. మాక్సి అరౌజో, అగస్టిన్ కానోబ్బియో కొద్ది నిమిషాల వ్యవధిలో గోల్స్ చేయడంతో స్కోరు 2-1గా మారిపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఉరుగ్వే సునాయాసంగా విజయం సాధిస్తుందనే భావన కనిపించింది.
మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన హెలియో..
రెండో అర్ధభాగంలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన హెలియో వరేలా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఉరుగ్వే గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్లెరా గోల్ లైన్‌కు ముందుకు రావడాన్ని గమనించి.. దూరం నుంచే అద్భుతమైన కిక్‌తో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అతనికి ఇదే తొలి గోల్ కావడం విశేషం. గోల్ అనంతరం వరేలా సంబరాల్లో మునిగిపోయాడు. ఈ మ్యాచ్ మరో ప్రత్యేక రికార్డుకు సైతం వేదికైంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఒక మ్యాచ్‌లో రెండు జట్లకు చెందిన ఇద్దరు గోల్‌కీపర్లు 40 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. కేప్ వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా 40 ఏళ్ల వయసులో ఉండగా, ఉరుగ్వే గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్లెరా కూడా ఇటీవలే 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు.
మ్యాచ్‌కు హాజరైన వోజిన్హా తల్లి..
స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్న వోజిన్హా.. ఉరుగ్వేపై కూడా కీలకంగా గోల్స్ పడకుండా అడ్డుకొని జట్టుగా ఊరటనిచ్చాడు. ఈసారి మ్యాచ్‌కు వోజిన్హా తల్లి సైతం స్టేడియంకు రావడం ప్తర్యేక ఆకర్షణగా మారింది. వీసా సమస్యల కారణంగా ఆమె తొలి మ్యాచ్‌కు హాజరు కాలేకపోయినా.. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించింది. కేప్ వెర్డేకు ఈ డ్రా కేవలం ఒక పాయింట్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకోవాలన్న వారి కలను సజీవంగా ఉంచింది. స్పెయిన్, ఉరుగ్వే వంటి బలమైన జట్లను నిలువరించిన ఈ పసికూన.. ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రపంచ శక్తులను సవాల్ చేస్తాం..
మ్యాచ్ అనంతరం జట్టు హెడ్‌కోచ్ బుబిస్టా మాట్లాడారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే చిన్న దేశాలు కూడా ప్రపంచ ఫుట్‌బాల్ శక్తులను సవాల్ చేయగలవన్నారు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా విషయాల్లో సమానత్వం ఉంటుందని, ప్రపంచ వేదికపై ప్రత్యర్థి ఎంత పెద్ద జట్టైనా.. ఆట ప్రారంభమైన తర్వాత అవకాశాలు అందరికీ సమానమేనన్నారు. కేవలం ఫుట్‌బాల్‌లోనే కాదు.. జీవితంలోని ప్రతి రంగంలోనూ కష్టాలు, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ కలను నమ్మి దాని కోసం శ్రమిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని తాము చూపించాలని కోరుకున్నామన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
- ●Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
- ●DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు

DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..






