Egypt vs New Zealand | 92 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌కు తొలి విజయం
Egypt vs New Zealand | తొమ్మిది దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న ఈజిప్ట్ కల ఎట్టకేలకు సాకారమైంది. ఫిఫా ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 1934లో తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఫరోస్ జట్టు, ప్రపంచకప్ చరిత్రలో మరపురాని విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది.
- 3-1 తేడాతో న్యూజిలాండ్ చిత్తు
- ఈజిప్ట్ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం
- నాకౌట్‌కు చేరువైన మహ్మద్ సలామ్ టీమ్
Egypt vs New Zealand | తొమ్మిది దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న ఈజిప్ట్ కల ఎట్టకేలకు సాకారమైంది. ఫిఫా ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 1934లో తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఫరోస్ జట్టు, ప్రపంచకప్ చరిత్రలో మరపురాని విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-జీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-1తో ఓడించి పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ చారిత్రక గెలుపు కోసం ఈజిప్ట్ 33,628 రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
తొలి గోల్ వేసిన కివీస్..
బీసీ ప్లేస్ స్టేడియంలో జరిగిన ఈ కీలక పోరులో న్యూజిలాండ్ మ్యాచ్ ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. 15వ నిమిషంలో ఫిన్ సర్మన్ గోల్ చేయడంతో కివీస్ జట్టు 1-0తో ముందంజ వేసింది. తొలి అర్ధభాగం ముగిసే వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించిన న్యూజిలాండ్‌పై రెండో అర్ధభాగంలో ఈజిప్ట్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 58వ నిమిషంలో ముస్తఫా జికో గోల్ వేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.ఆ తర్వాత 67వ నిమిషంలో జట్టు కెప్టెన్ మహ్మద్ సలాహ్ గోల్ చేసి ఈజిప్ట్‌కు ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. చివరలో ఆల్టర్‌నేట్ ప్లేయర్ మహ్మూద్ ట్రెజెగెట్ 82వ నిమిషంలో మరో గోల్ నమోదు చేయడంతో ఈజిప్ట్ విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో సలాహ్ ఒక గోల్, ఓ అసిస్ట్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జికో సైతం గోల్‌తో పాటు అసిస్ట్ నమోదు చేసి ఆకట్టుకున్నాడు. ఒక దశలో పూర్తిగా వెనుకబడిన జట్టు తిరిగి పుంజుకొని విజయం సాధించడం ఈజిప్ట్ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

విజయమే తెలియని జట్టు..
ఫిఫా ప్రపంచకప్ వేదికపై ఇప్పటివరకు విజయమే తెలియని ఈజిప్ట్‌కు ఈ విజయం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో తరాల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూసిన కల ఎట్టకేలకు నిజమైంది. ఫుట్‌బాల్‌కు ఈజిప్ట్‌లో ఉన్న అపారమైన ఆదరణకు తగ్గట్లుగా ప్రపంచకప్‌లో ఒక చారిత్రక విజయాన్ని చూడాలన్న దేశ ప్రజల కోరిక ఫలించింది. నిరాశ, చేజారిన అవకాశాలు, ఫలించని కలల మధ్య సాగిన దీర్ఘ ప్రయాణానికి ఈ విజయం మధుర జ్ఞాపకంగా నిలిచింది. 1934 ప్రపంచకప్‌లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించిన తొలి తరం ఆటగాళ్ల నుంచి, నేటి సలాహ్ నేతృత్వంలోని జట్టు వరకు సాగిన ఫుట్‌బాల్ ప్రయాణాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన విజయంగా దీన్ని అభిమానులు అభివర్ణిస్తున్నారు. కైరో నుంచి అలెగ్జాండ్రియా వరకు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
నాకౌట్‌కు చేరువగా..
ఇప్పటికే బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్, రెండు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్-జీలో అగ్రస్థానంలో నిలిచింది. అదే గ్రూప్‌లో ఇరాన్, బెల్జియం జట్లు గోల్స్ లేకుండా డ్రా చేసుకోవడంతో ఈజిప్ట్ స్థానం మరింత బలపడింది. ఇక గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఇరాన్‌తో పోటీపడనుంది. మరోవైపు ఇరాన్‌తో తొలి మ్యాచ్‌ను 2-2తో ముగించిన న్యూజిలాండ్.. తాజాగా ఓటమి ఎదురైనా నాకౌట్ రేసులో ఇంకా ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
- ●Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
- ●DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు

DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..






