త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND W Vs PAK W | మంధాన మెరుపులు.. పాక్ టార్గెట్ 171 ర‌న్స్‌

IND W Vs PAK W | ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక పోరులో భారత మహిళల జట్టు పోటీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత అర్ధశతకంతో రాణించగా, చివర్లో రిచా ఘోష్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

P

Sports | Published On Jun 14, 2026, 9.05 pm IST

IND W Vs PAK W | మంధాన మెరుపులు.. పాక్ టార్గెట్ 171 ర‌న్స్‌
Advertisement

IND W Vs PAK W | ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక పోరులో భారత మహిళల జట్టు పోటీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత అర్ధశతకంతో రాణించగా, చివర్లో రిచా ఘోష్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ విజయానికి 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

షఫాలీ వర్మ (6), జెమీమా రోడ్రిగ్స్ (1) స్వల్ప స్కోర్లకే ఔటవడంతో 18 పరుగుల వద్దే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టును బలమైన స్థితిలో నిలిపారు. మంధాన దూకుడుగా ఆడుతూ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ 36 పరుగులతో కీలక సహకారం అందించింది. ఇద్దరూ వెనుదిరిగిన తర్వాత రిచా ఘోష్ వేగంగా పరుగులు రాబట్టింది. 17 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి చివరి ఓవర్లలో స్కోరు వేగాన్ని పెంచింది. ఆమె ధాటికి భారత్ 170 పరుగుల మార్క్‌ను అందుకుంది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నారు. అయితే, భారత బ్యాటర్ల దూకుడును పూర్తిగా నియంత్రించడంలో మాత్రం విఫలమయ్యారు.

Advertisement
Advertisement