Goat | ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్.. మ్యాచ్ చూస్తుండగా ప్రొజెక్టర్ స్క్రీన్ ఎత్తుకెళ్లిన మేక.. వీడియో
Goat | ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ (Football World Cup) పీక్స్‌కు చేరింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ (FIFA World Cup) కోసం అభిమానులు ఉత్సాహంగా చూశారు.
Goat | త్రినేత్ర.న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ (Football World Cup) పీక్స్‌కు చేరింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ (FIFA World Cup) కోసం అభిమానులు ఉత్సాహంగా చూశారు. కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా స్కూళ్లకు సెలవు ఇచ్చేసింది. పబ్‌లు, బార్‌లు తెల్లవార్లు తెరిచే ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రొజెక్టర్లు (Projector), తమ ఫేవరెట్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు కొందరు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఓ పది ప్రొజెక్టర్‌లో మ్యాచ్‌ను సీరియస్‌గా చూస్తున్నారు. అంతా కలిసి ఏదో చేస్తున్నారనుకుందో ఏమో.. ఓ మేక (Goat) కూడా అక్కడికి వచ్చింది. అందరిలానే కొద్దిసేపు స్కీన్‌పై (Projector Screen) కదులుతున్న బొమ్మలను చూసింది.
గ్రౌండ్‌లో ప్లేయర్లు బాల్ కోసం అటూ ఇటూ పరుగెడుతుంటే చూసిన ఆ మేక.. తానెమన్నా తక్కువ తిన్నానా! అన్నట్లు ఆ స్క్రీన్‌ను నోట్లో కరుచుకుని పరుగు ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ అభిమానులు గోల చేస్తూ మేక వెంబడి ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత స్పేయిన్
కాగా, ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ (Spain) నిలిచింది. ఆ జట్టు దూకుడుముందు అర్జెంటీనా (Argentina) తేలిపోయింది. అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. దీంతో మ్యాచ్ 106వ నిమిషయంలో టోరెస్ ఫెరాన్ గోల్ సాధించడంతో స్పెయిన్ విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు సంబురాల్లో మునిగిపోయింది.
ప్రపంచకప్ సొంతం చేసుకున్న స్పెయిన్ రూ.481 కోట్లు దక్కించుకోగా, రన్నరప్ అర్జెంటీనా రూ.317 కోట్లు అందుకుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లకు రూ.279 కోట్లు, రూ.259 కోట్లు అందనుంది. టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె గోల్డెన్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. మొత్తం అతడు 10 గోల్స్ సాధించాడు. ఇక అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.
عبالها عشب حق الاكل 😂😂😂😂 pic.twitter.com/8bkHWbM8lG
— QAIS ALQASIMIًً (@Turki81873615) July 19, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






