Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి – కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి – కారణం ఇదే!
ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో మొరాకో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మొరాకో ఓటమితో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 10, 2026, 8.21 pm IST
Nora Fatehi | ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మొరాకో ఓటమితో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఎమోషనల్ అయ్యింది. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఫ్రాన్స్, మొరాకో మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా నోరా ఫతేహి వీక్షించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యాన్స్ చేతిలో మొరాకో ఓటమి పాలైంది. ఆరంభంలో ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చిన మొరాకో చివరలో తడబడిపోయింది. మొరాకో బలహీనతలను క్యాష్ చేసుకున్న ఫ్రాన్స్ సెకండాఫ్‌లో రెండు గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది.
ఎమోషనల్...
ఈ ఓటమితో ఫిఫా వరల్డ్ కప్ నుంచి మొరాకో వైదొలిగింది. మొరాకో ఓటమిని నోరా ఫతేహి జీర్ణించుకోలేకపోయింది. మ్యాచ్ ముగిసే టైమ్‌లో ఎమోషనల్ అయ్యింది. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
కెనడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. ఆమెకు మొరాకోతో ఉన్న లింక్ ఏమిటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నాయి. నోరా ఫతేహి తల్లిదండ్రులది మొరాకోనే. ఉద్యోగం కోసం కెనడా వచ్చారు. నోరా ఫతేహి బంధువులు ఇప్పటికీ చాలా మందే మొరాకోలో ఉన్నారట. ఈ వరల్డ్ కప్‌లో మాతృ దేశాన్ని సపోర్ట్ చేసింది నోరా.
లైవ్ పర్ఫార్మెన్స్...
కాగా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఆరంభ వేడుకల్లో నోరా ఫతేహి పాల్గొన్నది. సిర్ సిర్ అనే పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఈ పాటకు నోరా అదిరిపోయే స్టెప్పులతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
తెలుగులో....
నటిగా కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఫేమస్ అయ్యింది నోరా ఫతేహి. తెలుగులో ఎన్టీఆర్ టెంపర్, రవితేజ కిక్ 2, వరుణ్ తేజ్ లోఫర్ సినిమాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది. మట్కా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో కాంచన 4 సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. లారెన్స్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mrunal Thakur | తూచ్ … అంతా వట్టిదే – టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
జులై 28, 2026

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే – హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
జులై 26, 2026

Tara Sutaria | టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా బ్యాక్‌గ్రౌండ్ ఇదే – హాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ…
జులై 21, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!

బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ



