త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లారీలో మంట‌లు.. వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం, 200 మేక‌లు మృతి

Road Accident | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. జాతీయ‌ర ర‌హ‌దారిపై అదుపుత‌ప్పిన లారీ సైన్ బోర్డును ఢీకొట్టింది.

G

Telangana | Published On Sep 10, 2026, 7.26 am IST

Road Accident | లారీలో మంట‌లు.. వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం, 200 మేక‌లు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. జాతీయ‌ర ర‌హ‌దారిపై అదుపుత‌ప్పిన లారీ సైన్ బోర్డును ఢీకొట్టింది. దీంతో మంటలు చెల‌రేగి వ్య‌క్తి స‌జీవ‌ద‌హ‌న‌మ‌వ‌గా, అందులో ఉన్న మేక‌లు (Goat) మృతిచెందాయి.

200 మేక‌ల లోడుతో ఓ లారీ హైద‌రాబాద్ నుంచి క‌ర్నూలు (Kurnool) వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో భూత్పూర్ వ‌ద్ద అదుపుత‌ప్పిన లారీ.. జాతీయ‌ర‌హ‌దారిపై సూచిక బోర్డును ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి లారీ మొత్తానికి వ్యాపించ‌డంతో (Fire Accident) అందులో ఉన్న వ్య‌క్తి స‌హా 200 మేక‌లు అగ్నికి ఆహుత‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో భూత్పూర్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వాహ‌నాల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తున్నారు.

Advertisement
Advertisement