India T20 Series | టీ20 సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ఔట్.. ప్రసిద్ కృష్ణకు ఛాన్స్..!
India T20 Series | ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో త్వరలో జరుగనున్న టీ20 సిరీస్ నుంచి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో సెలక్షన్ కమిటీ ప్రసిద్ కృష్ణకు జట్టులో చోటు కల్పించింది.
India T20 Series | ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో త్వరలో జరుగనున్న టీ20 సిరీస్ నుంచి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో సెలక్షన్ కమిటీ ప్రసిద్ కృష్ణకు జట్టులో చోటు కల్పించింది. బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన చర్చల తర్వాత సిరాజ్‌కు తాత్కాలిక విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలిక ఇంటర్నేషనల్ సీజన్ నేపథ్యంలో రికవరీ అయ్యేందుకు అవసమయం ఇవ్వడం అవసరమని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నామని బోర్డు తెలిపింది. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రసిద్ కృష్ణ గుజరాత్ తరఫున ఆడి అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ఈ పేసర్ 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ 8 వికెట్లు సాధించాడు. అతని చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో గౌహతిలో ఆడాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 13 నుంచి అఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు ఎంపిక జట్టులోనూ ప్రసిద్ చోటు దక్కించుకున్నాడు.
ఈ రెండు టోర్నీలకు శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎన్నికయ్యాడు. జట్టులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశి సైతం జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది. భారత్ జట్టు జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచుల సిరీస్‌లో పాల్గొంటుంది. సెప్టెంబర్‌లో జపాన్‌లోని నాగోయాలో జరిగే ఆసియా గేమ్స్ పురుషుల టీ20 టోర్నీలో కూడా భారత జట్టు బరిలోకి దిగనుంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితిశ్‌రెడ్డి, అక్సర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్‌యాదవ్, వైభవ్ సూర్యవంశి, ప్రసిద్ కృష్ణ.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
- ●VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్
- ●Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Infosys | ఐటీ పరిశ్రమల శ్రమదోపిడీ.. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీగా ఫైన్

RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ

VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్






