Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..
Sabarimala | అయ్యప్ప భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు, పంబా నదిలో పెరిగిన వరద ప్రవాహం నేపథ్యంలో శబరిమల యాత్రకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిరపుత్తరి పూజల సందర్భంగా ఆగస్టు 2, 3 తేదీల్లో స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్న భక్తులు భద్రత దృష్ట్యా పరిస్థితులను అంచనా వేసుకుని.. పునరాలోచన చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సూచించింది.
Devotional | Published On Aug 1, 2026, 8.06 pm IST
Sabarimala | అయ్యప్ప భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు, పంబా నదిలో పెరిగిన వరద ప్రవాహం నేపథ్యంలో శబరిమల యాత్రకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిరపుత్తరి పూజల సందర్భంగా ఆగస్టు 2, 3 తేదీల్లో స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్న భక్తులు భద్రత దృష్ట్యా పరిస్థితులను అంచనా వేసుకుని.. పునరాలోచన చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సూచించింది. అధికార యంత్రాంగం సూచించిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది. మాస పూజల సందర్భంగా శబరిమల ఆలయాన్ని ఆగస్టు 2న సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం తెరవనున్నారు. ఆగస్టు 3న నిరపుత్తరి పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
పంబా ఉధృతితో అప్రమత్తం
ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో పంబా నదిలో నీటి మట్టం పెరిగింది. కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో భక్తుల ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పంబా నుంచి సన్నిధానం వరకు వెళ్లే మార్గంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో శబరిమల యాత్రను వాయిదా వేసుకోవాలని, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే దర్శనానికి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని పలు కొండ ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలపై కూడా పరిమితులు విధించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో క్వారీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం
శబరిమల యాత్రకు వచ్చే భక్తుల భద్రతకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంబా, నీలక్కల్, సన్నిధానం ప్రాంతాల్లో వైద్య, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తులు అధికారిక సూచనలు పాటిస్తూ సురక్షితంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో వచ్చే వారు యాత్ర విషయంలో మరింత జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు






