FIFA World Cup | మెస్సీ మరో ఘనత.. ఒకే మ్యాచ్‌లో రెండు ఫ్రీ కిక్ గోల్స్ చేసిన జట్టుగా అర్జెంటీనా రికార్డ్
FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్‌లో (FIFA World Cup) డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా (Argentina) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఒకే మ్యాచ్‌లో రెండు డైరెక్ట్ ఫ్రీ కిక్ గోల్స్ (free-kick goals) సాధించిన నాలుగో జట్టుగా రికార్డుల్లో నిలిచింది.
- వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు
- మ్యాచ్‌కే హైలైట్‌గా మెస్సి ఫ్రీ కిక్ గోల్
- జోర్డాన్‌పై 3-1తో విన్
FIFA World Cup | త్రినేత్ర.న్యూస్: ఫిఫా వరల్డ్ కప్‌లో (FIFA World Cup) డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా (Argentina) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఒకే మ్యాచ్‌లో రెండు డైరెక్ట్ ఫ్రీ కిక్ గోల్స్ (free-kick goals) సాధించిన నాలుగో జట్టుగా రికార్డుల్లో నిలిచింది. మరోవైపు సాకర్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ (Lionel Messi) తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాడు. చివరి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సబ్‌స్టిట్యూట్‌గా 60 నిమిషంలో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన అతడు కొట్టిన ఫ్రీ కిక్ గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జోర్డాన్‌తో (Jordan,) జరిగిన మ్యాచ్ ఈ రికార్డులకు వేదికైంది. ఆ జట్టును 3-1తో ఓడించి అజేయంగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది.

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి..
ఫుట్‌బాల్ ప్రపంచకప్ గ్రూప్ దశలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అర్జెంటీనా ఘనవిజయం సాధించింది. గ్రూప్-జె నుంచి అర్జెంటీనా ముందే నాకౌట్ చేరడం, జోర్డాన్ టోర్నీ నుంచి అప్పటికే నిష్క్రమించడంతో నామమాత్రంగా మారిన మ్యాచ్‌లో మెస్సీ.. 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో అడుగుపెట్టాడు. మ్యాచ్ 80 నిమిషంలో ఫ్రీ కిక్ అవకాశం లభించడంతో.. దానిని మెస్సీ గోల్‌గా మలిచాడు. జోర్డాన్ డిఫెండర్ల మధ్యలో ఉన్న ఖాళీలో బంతిని ఎడమ కాలితో స్పిన్ చేస్తూ గోల్‌లోకి పంపిచాడు.

తొలి గోల్ కూడా ఫ్రి కిక్‌తోనే
అంతకుముందు మ్యాచ్ 19వ నిమిషంలో జియోవాని లో సెల్సో (Giovanni Lo Celso) కూడా ఫ్రి కిక్‌తోనే గోల్ చేశాడు. మరో గోల్‌ను లాటారో మార్టినెస్ (Lautaro Martínez) (31వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలిచాడు. అతని స్థానంలోనే మెస్సీ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఇక జోర్డాన్ తరఫున ముసా టామారి 55వ నిమిషంలో గోల్ కొట్టాడు. జూలై 4న జరిగే ప్రీక్వార్టర్స్‌లో కేప్ వెర్డెతో అర్జెంటీనా తలపడనుంది.

రికార్డుల మోత..
- జోర్డాన్‌తో మ్యాచ్‌లో నేరుగా రెండు ఫ్రీ కిక్‌లను గోల్స్‌గా మలిచిన అర్జెంటీనా.. ఒకే ప్రపంచ కప్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది.
- అంతకుముందు బ్రెజిల్ (1966), యుగోస్లేవియా (1974), జపాన్ (2010) జట్లు ఈ ఘనత సాధించాయి.
- ఈ మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా మెస్సీ వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.
🌟 HISTORY MADE!
🇦🇷 Argentina becomes only the FOURTH team EVER to score TWO direct free-kick goals in a single World Cup match!
👊 The legends before them:
1️⃣ 🇧🇷 Brazil: Pelé & Garrincha vs Bulgaria 🇧🇬 (12.07.1966)
2️⃣ 🇷🇸 Yugoslavia: Dragan Džajić & Ivan Oblak vs Zaire 🇨🇩… pic.twitter.com/zsorULENx4
— FIFA World Cup Stats (@alimo_philip) June 29, 2026
తాజావార్తలు
- ●Beer vs Cool Drink | కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిదట.. అందులోనే చక్కెర, క్యాలరీలు తక్కువట!
- ●IAF Agniveer Vayu | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత
- ●Horoscope | జూన్ 29 రాశి ఫలాలు.. మీ నమ్మకాలు ఇతరులకు వింతగా తోచవచ్చు!
- ●Dr Vikrant Singh Thakur | నా గుండెను 20 నిమిషాలు ఆపేశారు
- ●BJP Bengal Formula for Telangana | బెంగాల్ ఫార్ములాతో తెలంగాణలో బీజేపీ 'డబుల్ ఇంజిన్' వ్యూహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బిగ్ వార్నింగ్!
- ●Harish Rao Challenges CM Revanth Reddy | రేవంత్.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్, ఎన్నికల్లో తేల్చుకుందాం: హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Beer vs Cool Drink | కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిదట.. అందులోనే చక్కెర, క్యాలరీలు తక్కువట!

IAF Agniveer Vayu | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత

Horoscope | జూన్ 29 రాశి ఫలాలు.. మీ నమ్మకాలు ఇతరులకు వింతగా తోచవచ్చు!

Dr Vikrant Singh Thakur | నా గుండెను 20 నిమిషాలు ఆపేశారు





