త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Messi | ఇండియా టూర్‌కు మెస్సికి రూ.89 కోట్లు ఇచ్చారు.. వెల్ల‌డించిన నిర్వాహ‌కుడు..

Messi | ఫుట్‌బాల్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సి కోల్‌క‌తా సాల్ట్ లేక్ స్టేడియం ప‌ర్య‌ట‌న ర‌సాభాస‌గా మారిన విష‌యం తెలిసిందే. పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఆయ‌నను చుట్టు ముట్ట‌డం, ట‌చ్ చేయ‌డం, ప్రైవ‌సీకి భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే మెస్సి కోల్‌క‌తాలో స‌మ‌యం గ‌డ‌ప‌కుండా వెళ్లిపోయాడ‌ని అర్థం అయింది.

S

Sports | Published On Dec 21, 2025, 1.18 pm IST

Messi | ఇండియా టూర్‌కు మెస్సికి రూ.89 కోట్లు ఇచ్చారు.. వెల్ల‌డించిన నిర్వాహ‌కుడు..
Advertisement

Messi | ఫుట్‌బాల్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సి కోల్‌క‌తా సాల్ట్ లేక్ స్టేడియం ప‌ర్య‌ట‌న ర‌సాభాస‌గా మారిన విష‌యం తెలిసిందే. పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఆయ‌నను చుట్టు ముట్ట‌డం, ట‌చ్ చేయ‌డం, ప్రైవ‌సీకి భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే మెస్సి కోల్‌క‌తాలో స‌మ‌యం గ‌డ‌ప‌కుండా వెళ్లిపోయాడ‌ని అర్థం అయింది. అయితే ఇదే విష‌యాన్ని ఆ ఈవెంట్ నిర్వాహ‌కుడు శ‌త‌ద్రు ద‌త్తా కూడా పోలీసుల‌కు తెలిపాడు. కొంద‌రు ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తులు త‌న‌ను బ‌ల‌వంత పెట్టార‌ని, దీంతో అనుకున్న దాని క‌న్నా మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో యాక్సెస్ కార్డుల‌ను ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని అన్నాడు. దీని వల్ల చాలా మంది సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు మెస్సి ఈవెంట్‌కు వ‌చ్చార‌ని, అలాగే అప‌రిచిత వ్య‌క్తులు మెస్సిని తాకార‌ని, అందుక‌నే మెస్సి అసంతృప్తికి గురై ఈవెంట్ నుంచి హ‌ఠాత్తుగా వెళ్లిపోయాడ‌ని ద‌త్తా వివ‌రించాడు. కాగా దత్తా ప్ర‌స్తుతం పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే.

ఇండియా టూర్‌కు గాను మెస్సికి రూ.89 కోట్లు చెల్లించామ‌ని ద‌త్తా పోలీసులకు తెలిపాడు. అలాగే మ‌రో రూ.11 కోట్ల‌ను ప్ర‌భుత్వానికి ప‌న్నుగా చెల్లించిన‌ట్లు వివ‌రించాడు. కాగా దత్తా బ్యాంకు ఖాతాల‌లో ఉన్న రూ.22 కోట్ల‌ను ఇప్ప‌టికే పోలీసులు సీజ్ చేశారు. అయితే మెస్సికి చెల్లించిన మొత్తంలో త‌న‌కు టిక్కెట్ల అమ్మ‌కాలు, స్పాన్స‌ర్స్ ద్వారా 60 నుంచి 70 శాతం మాత్ర‌మే రిక‌వ‌రీ అయ్యాయ‌ని స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) పోలీసుల‌కు ద‌త్తా వివ‌రించాడు. కానీ ద‌త్తా చెబుతున్న ఈ విష‌యాన్ని పోలీసులు మాత్రం విశ్వ‌సించ‌డం లేదు. ఈ ఈవెంట్ ద్వారా ఇంకా భారీ మొత్తంలోనే ద‌త్తాకు వ‌చ్చి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించేందుకు బ్లాక్ మ‌నీని ఉప‌యోగించారా..? అన్న కోణంలోనూ పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా డిసెంబ‌ర్ 13న కోల్‌క‌తాలో త‌న విగ్ర‌హాన్ని వ‌ర్చువ‌ల్‌గా ఆవిష్క‌రించిన మెస్సి ఆ త‌రువాత సాల్ట్ లేక్ స్టేడియంకు అభిమానుల‌ను క‌లిసేందుకు వెళ్లాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మెస్సి అక్క‌డి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోగా అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స్టేడియంలోని వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అటు మెస్సికి, ఇటు అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు తెల‌ప‌డంతోపాటు వెంట‌నే సిట్‌ను ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించ‌గా పోలీసులు ఆ త‌రువాత కొన్ని గంటల్లోనే నిర్వాహ‌కుడు శ‌త‌ద్రు ద‌త్తాను అరెస్టు చేశారు. అత‌నిపై రెండు కేసుల‌ను వారు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్‌కు టిక్కెట్ల సొమ్మును వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని ద‌త్తా ఇప్ప‌టికే తెలిపాడు. కాగా శుక్ర‌వారం ద‌త్తా ఇంట్లో సిట్ అధికారులు త‌నిఖీలు కూడా చేప‌ట్టారు. అయితే కోల్‌క‌తా ఈవెంట్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో నెల‌కొన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై ద‌త్తా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేద‌ని సిట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement