సింపుల్ పాస్ ఇవ్వడం కూడా రాదా? రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు
సీఎంతో మెస్సీ మ్యాచ్ ఆడిన దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఇప్పుడు రాజకీయ విమర్శలకూ దారితీసింది. మెస్సీకి బంతిని పాస్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి తడబడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో కూడా పర్యటించిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. సీఎంతో మెస్సీ మ్యాచ్ ఆడిన దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఇప్పుడు రాజకీయ విమర్శలకూ దారితీసింది. మెస్సీకి బంతిని పాస్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి తడబడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు.
ఫుట్‌బాల్ కోసం రెండు సార్లు పరిగెత్తిన మెస్సీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెస్సీతో కాసేపు ఆట ఆడారు. అప్పుడే సింపుల్ పాస్ కూడా మెస్సీకి రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోయారని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కిరణ్ రిజిజు.. రేవంత్ రెడ్డిపై చురకలు అంటించారు. ఒక సింపుల్ పాస్ ఇవ్వడం కూడా చేతకాలేదు. ప్రపంచ స్థాయి క్రీడాకారుడిని ఇలా పరిగెత్తించడం కరెక్టేనా? అంటూ కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ ఘటన జరగడాన్ని కేంద్ర మంత్రి పరోక్షంగా ప్రస్తావించారు.
సోషల్ మీడియాలో రచ్చ
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్త రాజకీయ రంగు పూసుకుంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి ఎద్దేవా చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ఈ వీడియోను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్‌ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదని హితువు పలుకుతున్నారు.
It's totally messed up !! CM Revanth Reddy Ji got a golden chance to play with GOAT but he couldn’t even give simple pass to #Messi He kicked far left & right to make Messi run around 😁 pic.twitter.com/jMRs160YHS
— Kiren Rijiju (@KirenRijiju) December 15, 2025
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



