త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Aroop Biswas | కోల్‌క‌తా మెస్సి ఈవెంట్ దెబ్బ‌కు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా..

S

National | Published On Dec 17, 2025, 8.47 am IST

Minister Aroop Biswas | కోల్‌క‌తా మెస్సి ఈవెంట్ దెబ్బ‌కు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా..
Advertisement

Minister Aroop Biswas | కోల్‌క‌తా: ప‌్ర‌ముఖ దిగ్గ‌జ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సి భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా తొలుత కోల్‌క‌తాను సంద‌ర్శించిన విష‌యం విదిత‌మే. అయితే అక్క‌డి సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల‌కు గాను నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ప‌శ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి, సీనియ‌ర్ తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడు అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామాను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి పంపించారు. దీనిపై స్పందించిన మ‌మ‌త ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం స‌రైంద‌ని అన్నారు. అయితే కోల్‌క‌తాలో మెస్సి ఇండియా గోట్ టూర్ నిర్వాహ‌కుడు శ‌త‌ద్రు దత్తాను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేడియంలో విధ్వంసం సృష్టించిన కొంద‌రు ఫ్యాన్స్‌ను సీసీటీవీ కెమెరాల ద్వారా గురించి అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు 5 మందిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా కోల్‌క‌తాలో మెస్సి ముందుగా త‌న సొంత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. భ‌ద్ర‌తా కార‌ణాల‌తో వ‌ర్చువ‌ల్‌గా ఆ విగ్ర‌హాన్ని లాంచ్ చేయ‌గా అక్క‌డి నుంచి మెస్సి స్థానికంగా ఉన్న సాల్ట్ లేక్ స్టేడియంకు వెళ్లారు. అయితే మెస్సి అక్క‌డ కేవ‌లం 10 నిమిషాలే ఉన్నారు. మంత్రి అరూప్ బిశ్వాస్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు ఇత‌ర టీఎంసీ నాయ‌కులు మెస్సితో ఫొటోలు దిగేందుకు ఆయ‌న ప‌ట్ల కాస్త అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. మెస్సిని ప‌ట్టుకుని లాగిన‌ట్లు చేశారు. దీంతో భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా మెస్సి ఆ స్టేడియం నుంచి వెంట‌నే వెళ్లిపోయారు.

అయితే మెస్సి అలా వెళ్ల‌డం కోల్‌క‌తా ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీంతో వారు వెంట‌నే ప‌ట్ట‌రాని కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోకి దూసుకువ‌చ్చి ఫ‌ర్నిచ‌ర్‌, ఇత‌ర వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వెంట‌నే స్పందించి మెస్సికి, అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఆ మంత్రితోపాటు ఇత‌ర సెల‌బ్రిటీలు, టీఎంసీ నాయ‌కుల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొన్ని వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి మెస్సిని చూద్దామ‌ని వ‌స్తే సెల‌బ్రిటీలు, లీడ‌ర్లు లేకిగా ప్ర‌వ‌ర్తించార‌ని, భార‌త్ ప‌రువు తీశార‌ని కామెంట్లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి అరూప్ రాజీనామా చేయ‌డం విశేషం.

ఇక మెస్సి కోల్‌క‌తా టూర్ అనుకున్న విధంగా జ‌ర‌గ‌క‌పోయినా త‌రువాత హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీల‌లో మాత్రం ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఆయ‌న‌తో ఫొటోలు దిగుతూ, షేక్ హ్యాండ్స్ ఇస్తూ స‌ర‌దాగా గ‌డిపారు. ఇక మెస్సి చివ‌రిగా అనంత్ అంబానీ ఆతిథ్యం స్వీకరించారు. గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు వెళ్ల‌డంతోపాటు అనంత్ అంబానీ నిర్వ‌హిస్తున్న వంతారా వైల్డ్ లైఫ్ సెంట‌ర్‌ను మెస్సి సంద‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement