Anant Ambani | మెస్సికి రూ.10.91 కోట్లు విలువ చేసే వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..!
Anant Ambani | ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సి భారత పర్యటన ముగిసిన విషయం విదితమే. తొలి రోజు కోల్‌కతా, హైదరాబాద్‌లలో పర్యటించిన ఆయన తరువాతి రోజుల్లో వరుసగా ముంబై, ఢిల్లీలలో సందడి చేశారు. ఆ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఏర్పాటు చేసిన వంతారా వైల్డ్ లైఫ్ సెంటర్‌ను కూడా మెస్సి సందర్శించారు. అక్కడ ఆయన చాలా సేపు గడిపారు. ఈ క్రమంలోనే ఆ సెంటర్‌ను సందర్శించడానికి ముందు మెస్సి అక్కడ అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు పూజల్లో పాల్గొన్నారు. హనుమాన్ పూజ చేసిన మెస్సి ఆ తరువాత వన్య ప్రాణులను తిలకించారు.
అయితే వంతారా సెంటర్‌కు వచ్చినప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్ లేదు. కానీ ఆ తరువాత సెంటర్‌లో ఆయన చేతికి ఓ వాచ్ కనిపించింది. అది రిచర్డ్ మిల్లె ఆర్ఎం 003-వి2 జీఎంటీ టౌర్‌బిలన్ ఏషియా ఎడిషన్ వాచ్ కాగా దాన్ని మెస్సికి అనంత్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచ్‌లను ఆ కంపెనీ కేవలం 12 పీస్‌లను మాత్రమే తయారు చేసింది. ఈ క్రమంలో వాటిల్లో ఒక వాచ్‌ను మెస్సికి అంబానీ బహుకరించి ఉంటారని తెలుస్తోంది. ఇక ఆ వాచ్ ధర 1.2 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.10.91 కోట్లు) కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
ఇక మెస్సి వంతారా పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ కూడా అదే కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్‌ను ధరించి కనిపించడం విశేషం. అనంత్ అంబానీ చేతికి రిచర్డ్ మిల్లె ఆర్ఎం 056 సఫైర్ టౌర్‌బిలన్ వాచ్ దర్శనమిచ్చింది. ఇది ఏకైక వాచ్ కాగా దీని ధర దాదాపుగా రూ.45.59 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కాగా వంతారాలో ఉన్న ఎలిఫెంట్ కేర్ సెంటర్‌లో మెస్సి చాలా సేపు గడపడం విశేషం. ఇక అక్కడ ఓ సింహం పిల్లకు అనంత్ అంబానీ, రాధికా అంబానీ దంపతులు మెస్సి గౌరవార్థం లియోనెల్ అనే పేరు పెట్టడం విశేషం. అయితే ఒక్క కోల్‌కతా టూర్ తప్ప మిగిలిన అన్ని చోట్ల మెస్సి చాలా హ్యాప్పీగా ఎంజాయ్ చేశారు. కానీ కోల్‌కతా పర్యటన మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
https://twitter.com/ANI/status/2000968259882131736
సంబంధిత వార్తలు

Rihanna | అంబానీ ఇంట్లో పాప్ సింగర్ రిహానా సందడి..! నెట్టింట ఫొటోలు వైరల్..!
ఏప్రిల్ 26, 2026

Anant Ambani | అనంత్ చేతికి శివుడి థీమ్‌తో ప్రత్యేకమైన వాచ్.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
ఏప్రిల్ 22, 2026

Anant Ambani | మరోసారి మంచి మనసు చాటుకున్న అనంత్ అంబానీ.. ఆలయాలకు భూరి విరాళం
ఏప్రిల్ 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



