త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మెస్సీతో ఫోటో కావాలా? 10 లక్షలు కట్టండి.. 100 మందికే అవకాశం

ఈ కార్యక్రమం గురించి ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి వెల్లడించారు. జీఎస్టీతో కలిపితే రూ.10 లక్షలు దాటుతుంది. అది కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. భారీ మొత్తంలో చెల్లించి తన అభిమాన ఆటగాడిని చూడలేమని సామాన్య అభిమానులు నిరాశ చెందుతున్నారు.

J

Sports | Published On Dec 11, 2025, 9.56 am IST

మెస్సీతో ఫోటో కావాలా? 10 లక్షలు కట్టండి.. 100 మందికే అవకాశం
Advertisement

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ భారత్ టూర్‌కు రానున్న విషయం తెలిసిందే. ది గోట్ టూర్ పేరుతో ఆయన భారత్‌లో పర్యటించనున్నాడు. ఆయన రాకతో హైదరాబాద్ నగరం సందడిగా మారనుంది. ది గోట్ టూర్‌లో భాగంగా మెస్సీ ఈనెల 13న హైదరాబాద్ రానున్నాడు. ఈనేపథ్యంలో మెస్సీ అభిమానుల కోసం ది గోట్ టూర్ నిర్వాహకులు అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ అవకాశం కేవలం 100 మందికి మాత్రమే.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్

మెస్సీ పర్యటనలో భాగంగా చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో కలిసి ఫోటో దిగే అరుదైన అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ అవకాశం కేవలం 100 మందికి మాత్రమే. వాళ్లు కూడా రూ.9.95 లక్షలు ప్లస్ జీఎస్టీ కడితే మెస్సీతో కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తారు.

ఈ కార్యక్రమం గురించి ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి వెల్లడించారు. జీఎస్టీతో కలిపితే రూ.10 లక్షలు దాటుతుంది. అది కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. భారీ మొత్తంలో చెల్లించి తన అభిమాన ఆటగాడిని చూడలేమని సామాన్య అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాకపోతే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు మాత్రం మెస్సీని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement