Hyderabad Metro Train | మందు బాబులకు గుడ్ న్యూస్… రాత్రి ఒంటిగంట వరకు అటు బార్లు, ఇటు మెట్రో
Hyderabad Metro Train | నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Train) అధికారులు ప్రయాణీకులకు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే 31న రాత్రి ఒంటిగంట వరకు బార్లు తెరిచిఉంచిన నేపథ్యంలో ఆ సమయం వరకు మెట్రో రైళ్లు కూడా నడపాలని అధికారులు నిర్ణయించారు.
Hyderabad Metro Train | నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Train) అధికారులు ప్రయాణీకులకు తీపి కబురు చెప్పారు. 31న బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా రాత్రి ఒంటి గంట వరకు ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. సాధారణంగా మెట్రోలో రాత్రి పదకొండు గంటలకు చివరి మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ సంవత్సరాంతమైన డిసెంబర్ 31న దీనికి మినహాయింపునిచ్చారు. జనవరి ఒకటవ తేదీ రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైలు బయల్దేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. 31వ తేదీ రాత్రి పార్టీల నేపథ్యంలో ఇప్పటికే ప్రజలెవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని (Drunk and Drive) నగర పోలీసులు (Police) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి, వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





