త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deer Meat | హైద‌రాబాద్‌లో జింక మాంసం క‌ల‌క‌లం.. ఒక‌రు అరెస్ట్

Deer Meat | హైద‌రాబాద్ న‌గ‌రంలో జింక మాంసం క‌ల‌క‌లం సృష్టించింది. అత్తాపూర్‌లో ఓ వ్య‌క్తి జింక మాంసం విక్ర‌యిస్తుండ‌గా.. రాజేంద్ర‌న‌గ‌ర్ ఎస్‌వోటీ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

S

Hyderabad | Published On Dec 30, 2025, 6.43 pm IST

Deer Meat | హైద‌రాబాద్‌లో జింక మాంసం క‌ల‌క‌లం.. ఒక‌రు అరెస్ట్
Advertisement

Deer Meat | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో జింక మాంసం క‌ల‌క‌లం సృష్టించింది. అత్తాపూర్‌లో ఓ వ్య‌క్తి జింక మాంసం విక్ర‌యిస్తుండ‌గా.. రాజేంద్ర‌న‌గ‌ర్ ఎస్‌వోటీ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం స‌ద‌రు వ్య‌క్తిని స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు.

జింక మాంసం విక్ర‌యిస్తున్న వ్య‌క్తిని సులేమాన్ న‌గ‌ర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ ఇర్ఫ‌నుద్దీన్‌గా గుర్తించారు. మ‌హ్మ‌ద్ నుంచి 15 కేజీల మాంసం, రూ. 3 వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలోని పెబ్బేరు నుంచి ఈ మాంసాన్ని అక్ర‌మంగా త‌ర‌లించి హైద‌రాబాద్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. పెబ్బేరులో కిలో మాంసాన్ని రూ. 800ల‌కు కొనుగోలు చేసి.. న‌గ‌రంలో అధిక ధ‌ర‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు తేలింది. మ‌హ్మ‌ద్‌పై వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement