Mann Ki Baat | భారత సంతతి క్రికెటర్లపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ..!
Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ వేదికపైగా తమను ప్రతిభను ప్రదర్శిస్తున్న అమెరికా, కెనడా, ఒమన్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఆయన ప్రశంసలు కురిపించారు.
Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ వేదికపైగా తమను ప్రతిభను ప్రదర్శిస్తున్న అమెరికా, కెనడా, ఒమన్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. క్రీడల్లో గెలుపోటములు మాత్రమే కాదని.. సంస్కృతులు, దేశాలను అనుసంధానించేందుకు ఓ మాధ్యమంగా పని చేస్తాయని మోదీ పేర్కొన్నారు. కెనడా జట్టుకు చెందిన దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థాకర్, నవనీత్ ధాలివాల్, అమెరికా జట్టులోని సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మోనాంక్ పటేల్ పేర్లను ప్రస్తావించారు. ఆయా ఆటగాళ్ల కృషి, అంకితభావం యువతరానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇది భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
క్రీడలు అందరినీ ఏకం చేస్తాయి..
ప్రధాని క్రీడల ప్రాముఖ్యతపై మాట్లాడారు. “ఆడేవారు ఎదుగుతారు. క్రీడలు మనల్ని ఒక్కటిగా కలుపుతాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూనే ఉంటారు. మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడిపై మీ చూపు తప్పక పడే ఉంటుంది. వేరే ఒక దేశానికి చెందిన జెర్సీ ధరించి మైదానంలోకి దిగే ఆ ఆటగాడి పేరు వినగానే మన దేశానికి చెందినవాడిలా అనిపిస్తాడు. భారతీయ మూలాలు కలిగిన వారంతా తమ కుటుంబాలు స్థిరపడిన దేశాల తరఫున ఆడుతుండడం గర్వకారణం” అని మోదీ పేర్కొన్నారు. కెనడా జట్టులో భారతీయ మూలాలు ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పుట్టాడని తెలిపారు. నవనీత్ ధలివాల్ చండీగఢ్‌కు చెందినవాడని చెప్పారు. హర్ష్ ఠాకర్, శ్రేయాస్ మోవ్వా తదితర ఆటగాళ్లు కెనడాకే కాకుండా భారత్‌కూ గర్వకారణమవుతున్నారని పేర్కొన్నారు.
మూలాలను మరువలేదు..
ఈ సందర్భంగా అమెరికా జట్టులోనూ భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారన్నారు. కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ అండర్-16, అండర్-18 జట్లకు ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ముంబయికి చెందిన సౌరభ్, హర్మీత్ సింగ్, ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ అమెరికా జట్టుకు గర్వకారణమని పేర్కొన్నారు. ఒమన్ జట్టులోనూ భారత రాష్ట్రాల తరఫున గతంలో ఆడిన పలువురు ఉన్నారని మోదీ తెలిపారు. జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ వంటి ఆటగాళ్లు ఒమాన్ క్రికెట్ జట్టులో కీలకంగా ఉన్నారన్నారు. న్యూజిలాండ్, యూఏఈ, ఇటలీ జట్లలోనూ భారతీయ మూలాలున్న ఆటగాళ్లు స్థానం సంపాదించారని పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ కర్మభూమి అభివృద్ధికి తోడ్పడుతూనే, మాతృభూమి మూలాలను మరువలేదని.. ఇదే భారతీయత ప్రత్యేకత అని మోదీ వ్యాఖ్యానించారు.
Read Also :
T20 World Cup 2026 | శ్రీలంకలో సూపర్ 8 మ్యాచ్‌లన్నింటికీ వర్షం ముప్పు..? అన్నీ రద్దయితే సెమీస్ బెర్తులు ఎలా ఇస్తారు..?
Shikhar Dhawan | సోఫీషైన్‌తో శిఖర్ ధావన్ పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన చాహల్
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






