త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | శ్రీ‌లంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌న్నింటికీ వ‌ర్షం ముప్పు..? అన్నీ ర‌ద్ద‌యితే సెమీస్ బెర్తులు ఎలా ఇస్తారు..?

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో భాగంగా కొలంబోలో జ‌ర‌గాల్సి ఉన్న పాకిస్థాన్‌, న్యూజిలాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే ర‌ద్దైంది. టాస్ వేసిన అనంత‌రం పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోగా ఆ స‌మ‌యంలోనే వర్షం ప్రారంభం అయింది.

S

Cricket | Published On Feb 22, 2026, 9.52 am IST

T20 World Cup 2026 | శ్రీ‌లంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌న్నింటికీ వ‌ర్షం ముప్పు..? అన్నీ ర‌ద్ద‌యితే సెమీస్ బెర్తులు ఎలా ఇస్తారు..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో భాగంగా కొలంబోలో జ‌ర‌గాల్సి ఉన్న పాకిస్థాన్‌, న్యూజిలాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే ర‌ద్దైంది. టాస్ వేసిన అనంత‌రం పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోగా ఆ స‌మ‌యంలోనే వర్షం ప్రారంభం అయింది. ఆ త‌రువాత ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వ‌లేదు. నిరంత‌రాయంగా వ‌ర్షం కురుస్తూనే ఉండ‌డంతో మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్రక‌టించి ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను ఇచ్చారు. అయితే సూప‌ర్ 8లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీ‌లంక ఒక గ్రూప్‌లో ఉండ‌గా ఈ జ‌ట్ల‌న్నీ శ్రీ‌లంక‌లోనే మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్నాయి. కానీ ఆ మ్యాచ్‌ల‌కు వ‌ర్షం అడ్డంకిగా మారనుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో అస‌లు అవ‌న్నీ జ‌ర‌గ‌క‌పోతే, జ‌ట్ల‌న్నింటికీ అలా పాయింట్ల‌ను ఇస్తూ వ‌స్తే చివ‌ర‌కు ఏయే టీమ్‌లు సెమీస్‌కు అర్హ‌త సాధిస్తాయి, అప్పుడు నిబంధ‌న‌లు అస‌లు ఎలా ఉంటాయి..? అని క్రీడా వ‌ర్గాలు, ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

నిబంధ‌న‌లు ఇవే..

ఇంట‌ర్నేష‌న్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయింగ్ కండిషన్స్‌లోని క్లాజ్ 16.10.4 ప్రకారం సూపర్‌-8 దశకు కూడా గ్రూప్ దశ నిబంధనలే వర్తిస్తాయి. ఒకే గ్రూప్‌లో జట్లు సమాన పాయింట్లతో ముగిస్తే ఒక వ‌రుస‌ క్రమంలో అర్హతను నిర్ణయిస్తారు. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుకు ముందుగా ప్రాధాన్య‌త ఉంటుంది. విజయాలు కూడా సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్ (NRR) ఆధారంగా స్థానాన్ని నిర్దారిస్తారు. ఇంకా సమానత ఉంటే హెడ్ టు హెడ్ మ్యాచ్ ఫలితాన్ని పరిగణన‌లోకి తీసుకుంటారు. ఈ ప్రమాణాలతోనూ తేలకపోతే, లేదా అన్ని మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిస్తే, 2026 ఫిబ్రవరి 6 నాటికి ఉన్న ఐసీసీ మెన్స్ టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా క్రమం నిర్ణయిస్తారు.

ఆ విష‌యంలో కివీస్‌, లంక‌నే ముందు..

సూపర్‌-8లో శ్రీ‌లంక‌లో ఆడే అన్ని మ్యాచ్‌లు పూర్తిగా వర్షంతో ర‌ద్దు కావ‌డం అసాధ్యమే అయినప్పటికీ, కొన్ని మ్యాచ్‌లు మాత్రం ప్రభావితమయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే వ‌ర్షం కార‌ణంగా ఒక వేళ అన్ని మ్యాచ్‌లు ర‌ద్ద‌యితే అప్పుడు నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుగా విజ‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు క‌నుక ఆ లెక్క‌న చూస్తే పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీ‌లంక‌, ఇంగ్లండ్ అన్ని జ‌ట్లు గ్రూప్ ద‌శ‌లో సమాన విజ‌యాల‌తో ఉన్నాయి. క‌నుక ఇక్క‌డ సెమీస్ స్థానాన్ని నిర్ణ‌యించ‌లేరు. త‌రువాతి అంశం నెట్ ర‌న్ రేట్ కాబ‌ట్టి ఆ అంశం ప‌రంగా చూస్తే న్యూజిలాండ్‌, శ్రీ‌లంక మిగిలిన రెండు జ‌ట్ల క‌న్నా ఆధిక్యంలో ఉన్నాయి. క‌నుక సెమీస్ బెర్తు ఈ రెండు జ‌ట్ల‌కు ఖ‌రారు అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఒక వేళ దుర‌దృష్ట‌వ‌శాత్తూ వ‌ర్షం కార‌ణంగా ఈ గ్రూప్‌లోని అన్ని మ్యాచ్‌లు ర‌ద్దు అయితే అప్పుడు న్యూజిలాండ్‌, శ్రీ‌లంక జ‌ట్లు నేరుగా సెమీస్‌కు అర్హ‌త సాధిస్తాయన్న‌మాట‌. ఇలా వ‌ర్షం ప్ర‌భావం పాక్‌, ఇంగ్లండ్ జ‌ట్ల సెమీస్ అవ‌కాశాల‌ను దెబ్బ తీసే అవకాశం ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

అయితే అన్ని మ్యాచ్‌లు వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డం అసాధ్యం. అలా అస‌లు జ‌రిగే అవ‌కాశ‌మే ఉండ‌దు. కానీ కొన్ని మ్యాచ్ లు ర‌ద్దు అయ్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తుండ‌డంతో అది ఆయా జ‌ట్ల సెమీస్ అవ‌కాశాల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ అంశంపై ఆయా టీమ్‌లు ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రిస్తాయో చూడాలి. ఇక అభిమానులంతా మ్యాచ్‌లు పూర్తిగా జరగాలని, ఫలితాలు మైదానంలోనే తేలాలని ఆశిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement