త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shikhar Dhawan | సోఫీషైన్‌తో శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన చాహ‌ల్‌

Shikhar Dhawan | టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను శ‌నివారం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను టీమిండియా క్రికెట‌ర్ యుజ్వేంద్ర చహల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశాడు.

P

Sports | Published On Feb 21, 2026, 8.18 pm IST

Shikhar Dhawan | సోఫీషైన్‌తో శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన చాహ‌ల్‌
Advertisement

Shikhar Dhawan | టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను శ‌నివారం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను టీమిండియా క్రికెట‌ర్ యుజ్వేంద్ర చహల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశాడు. కుటుంబీకులు, త‌క్కువ మంది అతిథుల మ‌ధ్య పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌స్తుతం నెట్టింట పెళ్లి ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన యువతి. ఆమె సీనియర్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ చదివారు. ప్రస్తుతం అబూదాబీలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సీనియర్ స్థాయి ఉద్యోగం చేస్తోంది.

ఈ జంట గ‌తేడాది మేలో త‌మ రిలేష‌న్‌ను బ‌య‌ట‌పెట్టారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఎంగేజ్‌మెంట్‌ను ప్ర‌క‌టించారు. ఈ జంట 2025లో దుబాయిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో క‌లిసి క‌నిపించారు. శిఖర్ ధావన్ గ‌తంలో ఐశా ముఖర్జీని 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ 11 ఏళ్ల కాపురంలో జంటకు ఒక కుమారుడు జోరావర్ ఉన్నాడు. 2023 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నారు. తాజాగా సోఫీ షైన్‌ను పెళ్లి చేసుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

Advertisement
Advertisement