Lionel Messi In Kolkata | కోల్‌కతాలో స్టేడియం నుంచి మెస్సీ ముందే ఎందుకు వెళ్లిపోయాడు..? అసలేం జరిగింది..?
Lionel Messi In Kolkata | అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన రసాభాసగా మారిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆ తరువాత సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకున్న మెస్సీ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆయనతో ఫొటోలు దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మెస్సీ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. వెంటనే మైదానంలోకి దూసుకువచ్చారు. కుర్చీలు, ఇతర వస్తువులు, స్టాండ్స్‌ను ధ్వంసం చేశారు. మైదానంలోకి వాటర్ బాటిల్స్‌ను విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సెక్యూరిటీ వేరే ద్వారం గుండా మెస్సీని బయటకు పంపించారు.
అయితే కోల్‌కతాలో మెస్సీ పర్యటన వైఫల్యం అవడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. వెంటనే విశ్రాంత జడ్జి, సీఎస్, పలువురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి జరిగిన ఘటనకు బాధ్యులను గురించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె మెస్సీతోపాటు క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే మైదానంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ మెస్సీ అక్కడి నుంచి త్వరగా ఎందుకు వెళ్లాడు..? దీని వెనుక కారణం ఏమిటి..? ఆయన మైదానంలో ఉండగానే ప్రేక్షకులు దాడికి పాల్పడ్డారా..? అని అందరిలోనూ సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ పూర్తిగా ఫెయిల్ అవడానికి మైదానం మేనేజ్‌మెంట్ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
గ్రౌండ్‌లో జరగాల్సిన మ్యాచ్ పట్ల మెస్సీకి సమాచారం అందించలేదని, ఆయనకు మ్యాచ్ గురించి చివరి నిమిషంలో చెప్పారని తెలుస్తోంది. అలాగే మ్యాచ్ నిర్వహించడంలోనూ టీమ్ మేనేజ్‌మెంట్ చాలా ఆలస్యం చేసిందని, మెస్సీ టీమ్‌కు సమాచారాన్ని చేరవేయడం ఆలస్యం అయిందని తెలుస్తోంది. దీంతో మ్యాచ్ జరగడం లేదని తెలుసుకున్న మెస్సీ అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించగా ఈ విషయం వెంటనే ఫ్యాన్స్ తెలుసుకుని ఆయన ఇంకా పూర్తిగా స్టేడియాన్ని వీడకముందే దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో జరుగుతున్న సంఘటనలను గమనించిన సెక్యూరిటీ, పోలీసులు భద్రతా కారణాలతో వెంటనే మెస్సీని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాన ద్వారం నుంచి వీలుకాకపోవడంతో వేరే ద్వారం గుండా మెస్సీని పంపించేశారు. ఈ విధంగా మెస్సీ అనుకున్న టైము కన్నా కాస్త ముందుగానే అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lionel Messi Wine and Sprite Drink | వైన్‌లో స్ప్రైట్ కలుపుకొని తాగిన మెస్సీ.. సర్రున ఎగబాకిన కోకకోలా స్టాక్స్
జనవరి 12, 2026

Messi | ఇండియా టూర్‌కు మెస్సికి రూ.89 కోట్లు ఇచ్చారు.. వెల్లడించిన నిర్వాహకుడు..
డిసెంబర్ 21, 2025

Anant Ambani | మెస్సికి రూ.10.91 కోట్లు విలువ చేసే వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..!
డిసెంబర్ 17, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



