CWG 2026 | గ్లాస్గోలో గర్జించిన భారత్
CWG 2026 | కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పతకాల వేట కొనసాగిస్తూ.. భారత్ ఇప్పటికే 39 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. చివరిరోజైన ఆదివారం భారత ప్లేయర్లు మరికొన్ని విభాగాల్లో పోటీపడనున్నారు. ఇందులో విజయం సాధిస్తే పతకాలు మరిన్ని పెరగనున్నాయి.
- 39 పతకాలు సాధించిన అథ్లెట్లు
- బాక్సింగ్‌లో స్వర్ణ పతకాలు
- వెయిట్‌లిఫ్టింగ్, పారా క్రీడల్లో సత్తా
- 2030లో భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్
- ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్
CWG 2026 | కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పతకాల వేట కొనసాగిస్తూ.. భారత్ ఇప్పటికే 39 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. చివరిరోజైన ఆదివారం భారత ప్లేయర్లు మరికొన్ని విభాగాల్లో పోటీపడనున్నారు. ఇందులో విజయం సాధిస్తే పతకాలు మరిన్ని పెరగనున్నాయి.
ఈ సారి భారత బాక్సింగ్ టీమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక్కరోజే ఏడు స్వర్ణాలు సాధిస్తూ భారత బాక్సర్లు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంగాస్ స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్ సైతం గోల్డ్ మెడల్స్ సాధించారు. లవ్లీనా బోర్గొహైన్, నరేందర్‌తో పాటు మరో బాక్సర్ రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ.. మొత్తం పది పతకాలతో బాక్సింగ్ టీమ్ తమ పంచ్ పవర్ ఏంటో చూపించింది.

అథ్లెటిక్స్‌లో మెరిసిన గుల్వీర్..
అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు మెరిశారు. ముఖ్యంగా గుల్వీర్ సింగ్ 5,000 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇదే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా మరో ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పారా అథ్లెటిక్స్‌లోనూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. అయితే, టోర్నీ ప్రారంభంలోనే వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స్వర్ణంతో భారత్ బంగారు బోణీ చేసింది. అనంతరం అథ్లెటిక్స్, జూడో, పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ వంటి విభాగాల్లో వరుస విజయాలతో భారత పతకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 39 పతకాలతో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌కు చివరి రోజు మరికొన్ని ఈవెంట్లలో అవకాశాలు ఉన్నాయి. ఈ జోరు కొనసాగితే 40 పతకాల మైలురాయిని కూడా దాటే అవకాశం ఉన్నది. యువ క్రీడాకారుల ఆత్మవిశ్వాసం, మహిళా అథ్లెట్ల ఆధిపత్యం, బాక్సర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ సారి భారత విజయాత్ర కొనసాగించింది.

టోర్నీ హైలెట్స్..
మొత్తం పతకాలు: 39
స్వర్ణాలు: 13
రజతాలు: 17
కాంస్యాలు: 9
పతకాల పట్టికలో భారత్: 4వ స్థానం
బాక్సింగ్‌లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు
గుల్వీర్ సింగ్‌కు కాంస్యం
ఐదు గోల్డ్స్‌మెడల్స్ సాధించిన మహిళా బాక్సర్లు
స్వర్ణ పతక విజేతలు..
వెయిట్‌లిఫ్టింగ్
మీరాబాయి చాను
పారా అథ్లెటిక్స్
ప్రవీణ్ కుమార్
సిమ్రన్
అజిత్ సింగ్
బాక్సింగ్
ప్రీతి పవార్
జైస్మిన్ లాంబోరియా
సాక్షి చౌదరి
అరుంధతి చౌదరి
ప్రియా ఘంగాస్
సచిన్ సివాచ్
అంకుశ్ పంఘాల్
అథ్లెటిక్స్
సర్వేశ్ కుషారే (హైజంప్)
నేటితో ముగియనున్న టోర్నీ
గ్లాస్గో వేదికగా జూలై 23న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆదివారం (ఆగస్టు 2)తో ముగియనున్నాయి. మిగిలిన కొన్ని పతకాల పోటీలు ముగిసిన అనంతరం అట్టహాసంగా ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న తొలి నటిగా మానుషి నిలువనున్నది. అలాగే, ఇందులో పాల్గొనే దేశాల క్రీడాకారుల పరేడ్‌తో పాటు వివిధ కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకలతో కామన్వెల్త్ గేమ్స్‌కు అధికారికంగా తెరపడనుంది.
2030లో ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..
ముగింపు వేడుకల్లో అత్యంత కీలక ఘట్టంగా 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలను అధికారికంగా భారత్‌కు అప్పగించనున్నారు. సంప్రదాయం ప్రకారం.. కామన్వెల్త్ స్పోర్ట్ జెండా, ఆతిథ్య హక్కుల ప్రతీకను ఆతిథ్య హక్కులు పొందిన దేశ ప్రతినిధులకు అందజేస్తారు. 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 2010 ఢిల్లీ తర్వాత భారత్ రెండోసారి ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుండగా, కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది (సెంటెనరీ) ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల్లో భారత సాంస్కృతిక ప్రదర్శనలు, 2030 ఆతిథ్య ప్రచార వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
కామన్వెల్త్ గేమ్స్-2026: భారత్ పతక విజేతలు (39 మంది పూర్తి జాబితా)
| క్రమ సంఖ్య | క్రీడాకారుడు | విభాగం | క్రీడ | పతకం |
|---|---|---|---|---|
| 1 | ఝండూ కుమార్ | పురుషుల హెవీవెయిట్ | పారా పవర్‌లిఫ్టింగ్ | 🥉 కాంస్యం |
| 2 | రిషికాంత్ సింగ్ | పురుషుల 60 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 3 | మీరాబాయి చాను | మహిళల 48 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥇 స్వర్ణం |
| 4 | రాజా ముత్తుపాండి | పురుషుల 65 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 5 | జ్ఞానేశ్వరి యాదవ్ | మహిళల 53 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 6 | బిందియారాణి దేవి | మహిళల 58 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥉 కాంస్యం |
| 7 | శర్మిలా ధన్‌కర్ | మహిళల షాట్‌పుట్ F57 | పారా అథ్లెటిక్స్ | 🥇 స్వర్ణం |
| 8 | సర్వేశ్ కుషారే | పురుషుల హైజంప్ | అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 9 | శిల్పా కే శైలా | మహిళల షాట్‌పుట్ F57 | పారా అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 10 | వల్లూరి అజయ్ బాబు | పురుషుల 79 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 11 | హర్జిందర్ కౌర్ | మహిళల 69 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 12 | గుల్వీర్ సింగ్ | పురుషుల 10,000 మీటర్లు | అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 13 | మురళీ శ్రీశంకర్ | పురుషుల లాంగ్ జంప్ | అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 14 | దిలీప్ మహాదు గావిట్ | పురుషుల 100 మీటర్లు T47 | పారా అథ్లెటిక్స్ | 🥇 స్వర్ణం |
| 15 | మొహమ్మద్ బాసిల్ | పురుషుల 100 మీటర్లు T47 | పారా అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 16 | లవ్‌ప్రీత్ సింగ్ | పురుషుల +110 కేజీలు | వెయిట్‌లిఫ్టింగ్ | 🥈 రజతం |
| 17 | సీమా కాలీరామణ | మహిళల డిస్కస్ త్రో | అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 18 | అస్మితా దే | మహిళల 48 కేజీలు | జూడో | 🥇 స్వర్ణం |
| 19 | హర్ష్ సింగ్ | పురుషుల 60 కేజీలు | జూడో | 🥇 స్వర్ణం |
| 20 | యామిని మౌర్య | మహిళల 57 కేజీలు | జూడో | 🥈 రజతం |
| 21 | నీరజ్ చోప్రా | పురుషుల జావెలిన్ త్రో | అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 22 | యశ్‌వీర్ సింగ్ | పురుషుల జావెలిన్ త్రో | అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 23 | తేజస్విన్ శంకర్ | పురుషుల డెకాథ్లాన్ | అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 24 | ప్రీతి పవార్ | మహిళల 54 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 25 | జైస్మిన్ లాంబోరియా | మహిళల 57 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 26 | ప్రవీణ్ చిత్రవేల్ | పురుషుల ట్రిపుల్ జంప్ | అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 27 | సెల్వ ప్రభు తిరుమారన్ | పురుషుల ట్రిపుల్ జంప్ | అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 28 | జదుమణి సింగ్ | పురుషుల 55 కేజీలు | బాక్సింగ్ | 🥈 రజతం |
| 29 | సోమన్ రాణా | పురుషుల షాట్‌పుట్ F57 | పారా అథ్లెటిక్స్ | 🥇 స్వర్ణం |
| 30 | శుభమ్ జుయాల్ | పురుషుల షాట్‌పుట్ F57 | పారా అథ్లెటిక్స్ | 🥈 రజతం |
| 31 | గుల్వీర్ సింగ్ | పురుషుల 5,000 మీటర్లు | అథ్లెటిక్స్ | 🥉 కాంస్యం |
| 32 | సాక్షి చౌదరి | మహిళల 51 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 33 | అరుంధతి చౌదరి | మహిళల 70 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 34 | ప్రియ ఘంగాస్ | మహిళల 60 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 35 | సచిన్ సివాచ్ | పురుషుల 60 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 36 | అంకుశ్ పంఘాల్ | పురుషుల 70 కేజీలు | బాక్సింగ్ | 🥇 స్వర్ణం |
| 37 | లవ్లీనా బోర్గొహైన్ | మహిళల 75 కేజీలు | బాక్సింగ్ | 🥈 రజతం |
| 38 | నరేందర్ బెర్వాల్ | పురుషుల +90 కేజీలు | బాక్సింగ్ | 🥈 రజతం |
| 39 | ఉన్నతి శర్మ | మహిళల 63 కేజీలు | జూడో | 🥉 కాంస్యం |
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- ●PM Modi | డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..
- ●Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ - ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

PM Modi | డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..

Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ - ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు





