Kangana Ranaut | నీ గర్ల్‌ఫ్రెండ్‌తో సంతోషంగా ఉండు – నా జోలికి రావద్దు – హృతిక్‌కు కంగనా కౌంటర్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య పదేళ్ల క్రితం మొదలైన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హృతిక్ రోషన్‌కు కంగనా రనౌత్ వార్నింగ్ ఇచ్చింది. తనను వేధిస్తున్న వారిని అడ్డుకోకుండా అగ్నికి అజ్యం పోసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Entertainment | Published On Aug 2, 2026, 5.24 pm IST
Kangana Ranaut | బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మధ్య పదేళ్ల క్రితం మొదలైన గొడవలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పాత గొడవలను ఉద్దేశిస్తూ హృతిక్ చేసిన చేసిన వ్యాఖ్యలకు కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యింది. అనవసరపు వ్యాఖ్యలు చేస్తూ తన జోలికి రావద్దంటూ బాలీవుడ్ హీరోకు వార్నింగ్ ఇచ్చింది.
మాజీ ప్రియుడు...
2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ తన సిల్లీ ఎక్స్ అంటూ కంగనా ఇచ్చిన స్టేట్‌మెంట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. కంగనా వ్యాఖ్యలపై హృతిక్ సీరియస్ అయ్యారు. తన పరువుకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కంగనా రనౌత్‌కు లీగల్ నోటీసులు పంపించాడు. ఈ లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కంగనా కూడా కోర్టును ఆశ్రయించింది.
రిలేషన్‌లో ఉన్నది నిజమే...
హృతిక్, కంగనా రిలేషన్‌లో ఉన్నది నిజమేనంటూ కొన్ని సీక్రెట్ ఫొటోలు, చాటింగ్, మెయిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ హృతిక్ రోషన్ లీక్ చేశాడంటూ కంగనా ఆరోపించింది. తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా క్రియేట్ చేసి ఈ మెయిల్స్ పంపించారని హృతిక్ బదులిచ్చాడు. ఆరోపణలు, వాదనలతో చాలా కాలం పాటు సాగిన ఈ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది.
పదేళ్ల తర్వాత...
పదేళ్ల తర్వాత మళ్లీ ఈ పాత గొడవలు తెరపైకి వచ్చాయి. ఇటీవల జంతర్‌మంతర్‌లో నిరసనలు చేసిన విద్యార్థులను ఉద్దేశిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ కామెంట్లను దృష్టిలో పెట్టుకొని కొందరు కంగనాకు వ్యతిరేకంగా సారీ హృతిక్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. "ఒకరిపై ఉన్న కోపం, ద్వేషంతో అతడి శత్రువుకు సపోర్ట్ చేయడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. వాస్తవాలు తెలిసే వరకు నిరీక్షించాలి. ఆ తర్వాతే అభిప్రాయాలు చెబితే బాగుంటుంది" అంటూ సారీ హృతిక్ హ్యాష్‌ట్యాగ్‌పై హృతిక్ రోషన్ రియాక్ట్ అయ్యాడు.
గర్ల్‌ఫ్రెండ్‌తో...
హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై కంగనా ధీటుగానే బదులిచ్చింది. ఈ బాలీవుడ్ హీరోకు వార్నింగ్ ఇచ్చింది. "గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్‌తో నువ్వు ఆనందంగా ఉన్నావు. కానీ నీ పేరుతో కొందరు నన్ను వేధిస్తున్నారు. ఆ వేధింపులను అడ్డుకోకుండా నీ మాటలతో ఇంకా రెచ్చగొట్టద్దు. అగ్నికి అజ్యం పోసేలా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ నా జోలికి రావద్దు. నీ గర్ల్‌ఫ్రెండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టద్దు" అంటూ పోస్ట్ పెట్టింది. కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్






