Ipl Aman Rao | ఐపీఎల్ వేలంలో మెరిసిన కరీంనగర్ క్రికెటర్ – రాజస్థాన్ రాయల్స్‌లో చోటు
Ipl Aman Rao | ఐపీఎల్ వేలంలో కరీంనగర్ యంగ్ క్రికెటర్ అమన్ రావు (Aman Rao) మెరిశాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కోటాలో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ 30 లక్షలకు కొనుగోలు చేసింది. అమన్‌రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి. దేశవాళీలో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు
అమన్ రావు
Ipl Aman Rao |ఐపీఎల్ వేలంలో తెలంగాణ క్రికెటర్ అమన్ రావు (Aman Rao) లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ యంగ్ క్రికెటర్‌ను వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సొంతం చేసుకుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల లిస్ట్‌లో వేలంలోకి వచ్చాడు. ఈ హిట్టర్‌ను 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
ప్రస్తుతం అమన్‌రావు దేశవాళీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అండర్ 23 విభాగంలో రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 160 స్ట్రైక్ రేట్‌తో ఈ టోర్నీలు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బాల్స్‌లోనే మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో యాభై రెండు పరుగులతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లో దృష్టిని ఆకర్షించాడు అమన్‌రావు.
అమన్‌రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు కూడా క్రికెటరే కావడం గమనార్హం. కరీంనగర్ హిందూ క్రికెట్ టీమ్ తరఫున పలు టోర్నీలు ఆడాడు. తండ్రి స్ఫూర్తితోనే అమన్‌రావు కూడా క్రికెటర్‌గా మారాడు. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. అమన్ రావు తాత పేరాల గోపాల రావు గతంలో కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. రాజకీయాల్లో వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది.
అమన్‌రావు ఐపీఎల్‌కు సెలెక్ట్ కావడంతో వెన్నంపల్లి గ్రామ ప్రజలతో పాటు కరీనంగర్ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో అమన్‌రావు రాణించాలని కోరుకుంటున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



