త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs SA 5th T20I | ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫైనల్ టీ20: పాండ్య–తిలక్ ధనాధన్ బ్యాటింగ్… భారత్ 231/5

సిరీస్ డిసైడర్ ఫైనల్ టీ20లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 231/5 భారీ స్కోర్ సాధించింది. పాండ్యా వేగవంతమైన ఫిఫ్టీతో మ్యాచ్‌పై భారత్ ఆధిపత్యం సాధించింది.

a

Sports | Published On Dec 19, 2025, 10.20 pm IST

IND vs SA 5th T20I | ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫైనల్ టీ20: పాండ్య–తిలక్ ధనాధన్ బ్యాటింగ్… భారత్ 231/5
Advertisement

India vs South Africa Final T20: Pandya, Tilak Power India to 231/5

(త్రినేత్ర క్రీడా విభాగం) 

అహ్మదాబాద్, డిసెంబర్ 19:
ఇండియా–క్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సిరీస్ డిసైడర్ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ 20 ఓవర్లలో 231/5 పరుగులు సాధించింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.

భారత్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ ధనాధన్ స్టార్ట్ ఇవ్వగా, సంజూ శాంసన్ స్ట్రోక్‌ప్లేతో స్కోర్ వేగం పెంచాడు. అభిషేక్ 21 బంతుల్లో 34 పరుగులు చేయగా, శాంసన్ 22 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. పవర్‌ప్లేలోనే భారత్ ఆధిపత్యం చూపింది.

సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్‌కే అవుటైనా, ఆ తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. తిలక్ వర్మ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. 42 బంతుల్లో 73 పరుగులు చేసిన తిలక్, కీలక సమయంలో రన్‌రేట్ తగ్గకుండా చూసాడు.

తిలక్ నిలకడ, పాండ్యా విధ్వంసం

2nd fastest fifty by hardhik Pandya in T20Is.

ఇన్నింగ్స్ చివరి భాగంలో హార్దిక్ పాండ్యా రాకతో అసలైన విధ్వంసం మొదలైంది. కేవలం 16 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి, భారత్ తరపున రెండో అత్యంత వేగవంతమైన టీ20 ఫిఫ్టీని నమోదు చేశాడు. 25 బంతుల్లో 63 పరుగులు చేసిన పాండ్య 5 సిక్సులు, 5 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మార్కో జాన్సెన్ వేసిన ఒక కట్టుదిట్టమైన ఓవర్ వల్ల రికార్డ్ బ్రేక్ మిస్ అయినా, డెత్ ఓవర్లలో స్కోర్‌ను భారీగా పెంచడంలో హార్థిక్​ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో శివమ్ దూబే సిక్స్, ఫోర్‌తో స్కోర్‌ను 231కి చేర్చాడు.

సౌతాఫ్రికా బౌలింగ్‌లో కోర్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్‌మన్ తలా ఒక వికెట్ సాధించారు. అయితే మొత్తం మీద బౌలర్లు భారత బ్యాటింగ్‌ను మాత్రం కట్టడి చేయలేకపోయారు.

భారీ లక్ష్యంతో భారత్ స్పష్టమైన ఆధిక్యం

భారత్ టీ20ల్లో ఇంత భారీ స్కోరును అడ్డుకోవడంలో ఇప్పటివరకు విఫలమవలేదు. సౌతాఫ్రికా కూడా ఇలాంటి లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించిన చరిత్ర ఉంది. సిరీస్ డిసైడర్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా, అహ్మదాబాద్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో నిలిచింది. ఇది రెండు జట్లకు ఈ ఏడాది చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఇండియా బ్యాటింగ్ స్కోర్‌కార్డ్

బ్యాట్స్‌మన్ R B 4s 6s
సంజూ శాంసన్ (wk) 37 22 4 2
అభిషేక్ శర్మ 34 21 6 1
తిలక్ వర్మ 73 42 10 1
సూర్యకుమార్ యాదవ్ (c) 5 7 0 0
హార్దిక్ పాండ్య 63 25 5 5
శివం దూబే* 10 3 1 1
జితేష్ శర్మ* 0 0 0 0

మొత్తం: 231/5 (20 ఓవర్లు)  |  రన్‌రేట్: 11.55 | ఎక్స్‌ట్రాలు: 9 (LB 3, W 6) 

మ్యాచ్​ ఫలితం కోసం ఇక్కడే చూడండి..

Advertisement
Advertisement