త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మ‌ళ్లీ వాన‌గండం త‌ప్ప‌దా.?

IND vs ENG 2nd T20 | భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో రెండో పోరు శనివారం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. డర్హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 189 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో వ‌ర్షం కుర‌వ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.

P

Sports | Published On Jul 3, 2026, 5.12 pm IST

IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మ‌ళ్లీ వాన‌గండం త‌ప్ప‌దా.?
Advertisement

IND vs ENG 2nd T20 | భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో రెండో పోరు శనివారం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. డర్హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 189 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో వ‌ర్షం కుర‌వ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో రెండో టీ20పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి వాతావరణమే మ్యాచ్‌కు ఆటంకం క‌లిగిస్తుందేమోన‌నే ఆందోళన వ్యక్తమవుతోంది.

మాంచెస్టర్ వాతావరణం ఎలా ఉంది?

మాంచెస్టర్‌లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వివ‌రించింది. టాస్‌కు ముందు స్వల్ప జల్లులు కురిసే సూచనలు ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వర్షం కురిసే అవకాశం 24 శాతం నుంచి 13 శాతానికి తగ్గనుంది. మ్యాచ్ ముగిసే సమయానికి స్వల్పంగా వర్ష సూచనలు ఉన్న‌ప్ప‌టికీ.. మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రికార్డు ఎలా ఉన్నాయంటే..?

మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అదే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ తన ఏకైక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా, అజింక్య రహానే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 159 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 69 పరుగులతో రాణించాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం కేఎల్ రాహుల్ కేవలం 54 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేయడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకూ వేదిక

ఈ మైదానం ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లోనూ కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన భారత్, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

జ‌ట్లు ఇలా ఉండొచ్చు..

టీమిండియా : సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సకీబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్/జోఫ్రా ఆర్చర్.

Advertisement
Advertisement