India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
India vs England | భారత జట్టు తరఫున అరంగేట్రం కోసం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షిస్తున్నాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఐర్లాండ్ పర్యటన తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో కూడిన ఓపెనింగ్ కాంబినేషన్‌పైనే నమ్మకం పెట్టుకున్నది.
India vs England | భారత జట్టు తరఫున అరంగేట్రం కోసం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షిస్తున్నాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఐర్లాండ్ పర్యటన తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో కూడిన ఓపెనింగ్ కాంబినేషన్‌పైనే నమ్మకం పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు అవకాశం దక్కడం లేదు. ఈ విషయంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌కు అవకాశాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే.. చివరికి అతడిపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘అతడికి అవకాశం వచ్చినప్పుడు ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. అయితే, 15 ఏళ్ల వయసులో ఆటగాళ్లు ఒత్తిడిని అంతగా ఆలోచించరు. రెండో, మూడో మ్యాచ్‌లో అవకాశం వస్తే వెంటనే రాణించాల్సి ఉంటుందని అతడికి తెలుసు’ అని గవాస్కర్ పేర్కొన్నారు. అయితే, వైభవ్ వయసు అతడికి అనుకూలంగా మారవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘అతడు జట్టులో ఉండడం ఆనందంగా భావిస్తాడు. దేశంలోని గొప్ప ఆటగాళ్లతో కలిసి నేర్చుకునే అవకాశం దొరకడం అతనికి చాలా ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి ఎదురైనా, భారత జట్టు మేనేజ్‌మెంట్ ఓపెనింగ్ జంటపై మార్పులు చేయలేదు. సంజూ, అభిషేక్, ఇషాన్‌లపై నమ్మకాన్ని పెట్టుకున్నది. దాంతో వైభవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.
తొలి టీ20 వర్షార్పణం
ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యేలోపే వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆరంభంలోనే 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సంజు శాంసన్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 24 బంతుల్లో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్‌లో టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం ఇచ్చాడు. చివర్‌లో శివమ్ దూబే 21 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేసి స్కోరును 189 వరకు తీసుకెళ్లాడు. ఇంగ్లండ్ తరఫున సాకిబ్ మహ్మద్ 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఛేజింగ్ ప్రారంభం కాకముందే వర్షం మరింత పెరగడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా లేదా అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tollywood | గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి - హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
- ●22 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం
- ●PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?
- ●Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్
- ●Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్
- ●IBPS | 6715 పోస్టులతో IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్..

Tollywood | గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి - హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి

22 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం

PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?

Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్




