Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్‌కే ఆసక్తి..!
Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు వార్తల్లో నిలుస్తోంది. లీగ్ దశ మధ్యలోనే హార్దిక్ అనూహ్యంగా జట్టును వీడడం చర్చకు దారితీసింది. తొలుత గాయం కారణంగానే దూరమయ్యాడని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత జట్టులో అంతర్గత విభేదాలున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి.
Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు వార్తల్లో నిలుస్తోంది. లీగ్ దశ మధ్యలోనే హార్దిక్ అనూహ్యంగా జట్టును వీడడం చర్చకు దారితీసింది. తొలుత గాయం కారణంగానే దూరమయ్యాడని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత జట్టులో అంతర్గత విభేదాలున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. ముంబయి ఇండియన్స్ లీగ్ దశ నుంచి నిష్క్రమించిన తర్వాత.. కొందరు సీనియర్ ఆటగాళ్ల తీరుపై హార్దిక్ అసంతృప్తిగా ఉన్నాడని, వచ్చే సీజన్‌లో జట్టుతో కొనసాగకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ట్రేడ్ విధానంలో సీఎస్‌కే జట్టులో దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
హార్దిక్ కోసం సీఎస్‌కే ప్రతిపాదన
హార్దిక్ పాండ్యాను ముంబయి నుంచి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అతని కోసం ఇద్దరు ఆటగాళ్లతో పాటు రూ.10 కోట్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో హార్దిక్‌ను తీసుకునేందుకు సీఎస్‌కే.. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేను ట్రేడ్‌లో భాగం చేసుకోవచ్చనే వార్తలు వచ్చాయి. తాజాగా సమాచారం ప్రకారం.. ముంబయి డిమాండ్ చేస్తున్న ప్యాకేజీకి సీఎస్‌కే పూర్తిగా అంగీకరించడం లేదు. ఐపీఎల్ 2026లో 180 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్న 19 ఏళ్ల ఆయుష్ మాత్రేను ముంబయి భవిష్యత్ ఆటగాడిగా చూస్తోంది. అందుకే హార్దిక్ కోసం అతన్ని కూడా కోరుతున్నట్లు సమాచారం. కానీ మాత్రేను వదులుకునేందుకు సీఎస్‌కే సిద్ధంగా లేదని తెలుస్తోంది. చెన్నై కూడా సైతం మాత్రేను భవిష్యత్ కీలక ఆటగాడిగా భావిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయంగా డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను ఇవ్వడంతో పాటు రూ.10 కోట్లను చెల్లించే ప్రతిపాదనను సీఎస్‌కే చేసినట్లు సమాచారం. ఈ డీల్ పూర్తయితే ముంబయి ఇండియన్స్‌కు రూ.20 కోట్లకుపైగా విలువైన ఆటగాళ్లు జట్టుతో చేరే అవకాశం ఉందని అంచనా.
ఐపీఎల్ 2026లో హార్దిక్ ప్రదర్శన అంతంతే..
హార్దిక్ పాండ్యా భారత క్రికెట్‌లో అరుదైన ఆల్‌రౌండర్. వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం, బ్యాటింగ్ నైపుణ్యం, కెప్టెన్సీ అనుభవం అతడి ప్రత్యేకత. విదేశీ ఆటగాడి స్థానాన్ని వినియోగించాల్సిన అవసరం లేకుండా జట్టుకు సమతుల్యత తీసుకురాగలడు. అయితే, ఐపీఎల్ 2026లో మాత్రం పాండ్యా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. బ్యాట్‌తో కేవలం 206 పరుగులు మాత్రమే చేయగా.. బంతితో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో సీఎస్‌కే అతడి ప్రస్తుత ఫామ్ కంటే భవిష్యత్ సామర్థ్యాలపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుందా అనే చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ట్రేడ్‌గా నిలుస్తుందా?
హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ వ్యవహారం రెండు జట్ల వ్యూహాలను స్పష్టంగా చూపిస్తోంది. ముంబయి ఇండియన్స్ యువ ప్రతిభతో పాటు నిరూపించుకున్న ఆటగాళ్లను కోరుకుంటుండగా.. సీఎస్‌కే తమ ప్రస్తుత జట్టు సమతుల్యతను కాపాడుకుంటూనే ఓ ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. చర్చలు విఫలమైతే కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం పాండ్యా కోసం రేసులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా సైతం సరైన ప్లేయర్‌తో పాటు కెప్టెన్ కోసం చూస్తోంది. ఇరుజట్లలో ముంబయితో డీల్ చేసుకున్నా.. ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్‌లో ట్రేడ్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!
జూన్ 19, 2026

Ira Aery | ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెటర్ అందానికి ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ – ఎవరీ ఇరా ఏరీ?
జూన్ 16, 2026

IPL 2026 | ఐపీఎల్లో నిరాశ పరిచిన ముంబయి.. హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే ఏమన్నాడంటే..?
మే 24, 2026
తాజావార్తలు
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ●CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ



