FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 విజేత జట్టుకు ఈసారి ట్రోఫీ, బంగారు పతకాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఛాంపియన్‌షిప్ రింగ్‌ను సైతం ప్రదానం చేయనున్నారు. ఫిఫా టోర్నీ చరిత్రలో విజేతలకు ఈ తరహా గౌరవం దక్కడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఛాంపియన్‌షిప్ రింగ్ సంప్రదాయాన్ని ఫిఫా ఈసారి ప్రపంచకప్‌లో ప్రవేశపెట్టింది.
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 విజేత జట్టుకు ఈసారి ట్రోఫీ, బంగారు పతకాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఛాంపియన్‌షిప్ రింగ్‌ను సైతం ప్రదానం చేయనున్నారు. ఫిఫా టోర్నీ చరిత్రలో విజేతలకు ఈ తరహా గౌరవం దక్కడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఛాంపియన్‌షిప్ రింగ్ సంప్రదాయాన్ని ఫిఫా ఈసారి ప్రపంచకప్‌లో ప్రవేశపెట్టింది. న్యూయార్క్‌లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్లో స్పెయిన్, అర్జెంటీనా తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. ఫైనల్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీ, పతకాలతో పాటు తాత్కాలిక ఛాంపియన్‌షిప్ రింగ్‌లను ప్రదానం చేయనున్నారు.
వరుసగా రెండో టైటిల్‌పై అర్జెంటీనా గురి
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ఆరంభంలో వెనుకబడిన అర్జెంటీనా, ఎంజో ఫెర్నాండెజ్ సమం చేసిన గోల్‌తో తిరిగి పోటీలోకి వచ్చింది. ఇంజ్యూరీ టైమ్‌లో లౌటారో మార్టినెజ్ చేసిన గోల్ జట్టుకు విజయాన్ని ఖాయం చేసింది. ఈ ఓటమితో 1966 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలన్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. మరో సెమీఫైనల్లో స్పెయిన్ 2-0తో ఫ్రాన్స్‌ను ఓడించి 2010 తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్‌కు ఇది రెండో ఫైనల్. యువ సంచలనం లామిన్ యమాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు లూకాస్ డిగ్నే నుంచి బంతిని చేజిక్కించుకుని పెనాల్టీ సాధించగా.. మికెల్ ఓయార్జబల్ 22వ నిమిషంలో దాన్ని గోల్‌గా మలిచాడు. ద్వితీయార్థంలో డానీ ఓల్మోతో సమన్వయంతో పెడ్రో పోరో గోల్‌గా మార్చి స్పెయిన్‌కు 2-0 ఆధిక్యం అందించాడు. యమాల్ మరోసారి బంతిని నెట్‌లోకి పంపినా ఆఫ్‌సైడ్ కారణంగా గోల్ రద్దయ్యింది. చివరలో కిలియన్ ఎంబాపే, ఆరెలియన్ చౌమెనీ తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు.
ఛాంపియన్‌షిప్ రింగ్ ప్రత్యేకతలు ఇవే..
ప్రపంచకప్-2026లో తొలిసారిగా పత్యేకంగా 2,026 రింగ్‌లను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. వీటిని ప్రత్యేక డిజైన్‌తో రూపొందించారు. మొత్తం రింగ్‌లలో 30 రింగ్‌లను విజేతలతో పాటు స్టాఫ్‌కు అందజేస్తారు. మిగతా 1,996 రింగ్‌లను అధికారిక లైసెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు విక్రయిస్తారు. ప్రతి రింగ్ ఒకవైపు ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ఆకృతి, మరోవైపు విజేత జట్టుకు సంబంధించిన ప్రత్యేక డిజైన్ ఉంటుంది. ప్రతి రింగ్‌కు ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆటగాళ్ల వేళ్ల కొలతలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రతి రింగ్‌తో పాటు ప్రామాణికత ధ్రువీకరణపత్రం సైతం అందజేస్తారు. అయితే, ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలో విజేతలకు ఈ రింగ్స్‌ను అందించే అవకాశం లేదు. విజేత జట్టు కెప్టెన్, హెడ్‌కోచ్‌కు తాత్కాలిక రింగ్స్‌ను ఇస్తారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలి కొతలను తీసుకొని అందుకు అనుగుణంగా తయారు చేసిన ఒరిజినల్ చాంపియన్‌షిప్ రింగ్‌లను అధికారికంగా అందజేస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి
- ●Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?
- ●Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
- ●US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
- ●Samvidhan Bachao | విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి
- ●MLA Sudheer Reddy | జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే

MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి

Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?

Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు






